బంగ్లాదేశ్ బార్డర్‌లో బీఎస్ఎఫ్ శునకం ప్రసవం.. దర్యాప్తునకు ఆదేశాలు

By Mahesh KFirst Published Dec 31, 2022, 1:58 PM IST
Highlights

బంగ్లాదేశ్ సరిహద్దులో ఓ బీఎస్ఎఫ్ శునకం ప్రసవించింది. మూడు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. దీనిపై బీఎస్ఎఫ్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. రూల్స్ ప్రకారం, హై సెక్యూరిటీ జోన్‌లో బీఎస్ఎఫ్ శునకం గర్భం దాల్చరాదు.
 

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ బార్డర్‌లో మోహరించిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ఓ శునకం ప్రసవించింది. మూడు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. దీనిపై అధికారులు షాక్ అయ్యారు. బీఎస్ఎఫ్ వెంటనే దీనిపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. రూల్స్ ప్రకారం, బీఎస్ఎఫ్ డాగ్ హై సెక్యూరిటీ జోన్‌లో గర్భం దాల్చకూడదు. ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షించే.. దాని హ్యాండ్లర్స్ వద్ద ఉన్నప్పుడు అది గర్భం దాల్చరాదు. అయితే, ఫోర్స్‌లోని వెటెరినరీ వింగ్ పర్యవేక్షణలో మాత్రమే బీఎస్ఎఫ్ డాగ్ గర్భం దాల్చాలి.

బంగ్లాదేశ్ సరిహద్దులో మేఘాలయాలో షిల్లాంగ్‌లోని బార్డర్ ఔట్‌పోస్టులో ఈ స్నిఫర్ డాగ్‌ను మోహరించారు. 

బీఎస్ఎఫ్, 170 బెటాలియన్ ఆఫీసు కమాండంట్ ధనక్‌గిరి (మేఘాలయా,తురా) ఈ విషయమై ఓ డిసెంబర్ 23న ఓ లేఖ రాశారు. బంగ్లాదేశ్ బార్డర్‌లో స్నిఫర్ డాగ్ గర్భం దాల్చడంపై సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ చేపట్టాలని డిప్యూటీ కమాండంట్‌ను ఆదేశించారు. షిల్లాంగ్ బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్‌కు లోబడి డిప్యూటీ కమాండంట్ అజీత్ సింగ్ సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ చేపట్టాలని ఆ ఆదేశాలు పేర్కొన్నాయి. 43 బెటాలియన్‌కు చెందిన శునకం లాల్సీ (ఫీమేల్) ఏ పరిస్థితుల్లో గర్భం దాల్చి ముగ్గురు కుక్క పిల్లలను ప్రసవించిందో దర్యాప్తు చేయాలని తెలిపాయి. 2022 డిసెంబర్ 5న ఉదయం 10 గంటలకు బగ్‌మారా బీఓపీ వద్ద మూడు కుక్క పిల్లలను బీఎస్ఎఫ్ శునకం లాల్సీ కన్నది.

Also Read: 11 సంవత్సరాలు సర్వీస్.. స్నిఫర్ డాగ్ కి ఘనంగా వీడ్కోలు

బీఎస్ఎఫ్ వెటెరినరీ వింగ్ సీనియర్ ఆఫీసర్ ఒకరు దీనిపై స్పందిస్తూ.. తాము శిక్షణ ఇచ్చిన శునకం గర్భం దాల్చడానికి సంబంధించి తమకు ఓ ప్రొసీజర్ ఉంటుందని వివరించారు.  ఈ శునకాన్ని హ్యాండిల్ చేస్తున్నవారి నిర్లక్ష్యం  కారణంగా లాల్సీ డాగ్ ప్రెగ్నెంట్ అయి ఉంటుందని అన్నారు.

click me!