ఉత్తర ప్రదేశ్‌లో ఘోరం...ట్రక్కు చక్రాల కింద నలిగి 8 మంది మృతి

Published : Jan 01, 2019, 08:58 PM IST
ఉత్తర ప్రదేశ్‌లో ఘోరం...ట్రక్కు చక్రాల కింద నలిగి 8 మంది మృతి

సారాంశం

ఉత్తర ప్రదేశ్ లో నూతన సంవత్సర ఆరంభంలోనే విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం 8 మంది అమాయకులను బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో మరికొంత తీవ్రంగా గాయపడ్డారు.  ఈ దుర్ఘటన చందౌలీ జిల్లాలో చోటుచేసుకుంది.     

చందౌలీ జిల్లా కేంద్రంలో ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డుపక్కనే వున్న ఓ దళిత వాడలోకి దూసుకుపోమయింది. దీంతో ట్రక్కు కింద నలిగి 8 మంది అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. మృతిచెందిన వారిలో నలుగురు చిన్నారులు వున్నారు. అలాగే మరికొంత మంది చిన్నారులు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని మొదట ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.   

PREV
click me!

Recommended Stories

World Coldest Place : ఫ్రిజ్‌లో ఉన్నట్టే.. ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ ప్లేస్ ఇదే గురూ !
పేదరిక నిర్మూలనకు సరికొత్త ఫార్ములా.. ఇక గ్రామాల బాధ్యత విద్యార్థులదే