
తమిళనాడు : tamil naduలోని కుంభకోణంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన newly marriedను ఆమె సోదరుడు feast ఏర్పాటు చేసి, ఇంటికి పిలిచాడు. విందుకు వచ్చిన ఆమెను, ఆమె భర్తను కర్కశంగా murder చేశాడు. ఈ షాకింగ్ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెడితే.. నర్సుగా పనిచేస్తున్న 23 ఏళ్ల శరణ్యకు ఐదు రోజుల క్రితం మోహన్‌తో వివాహమైంది. పెళ్లికి ముందు తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి తీసుకోవాల్సి రావడంతో దంపతులు సోమవారం వారి ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే శరణ్య సోదరుడు శక్తివేల్ దంపతులను తన ఇంటికి విందుకు పిలిచాడు. విందు అనంతరం దంపతులు బయలుదేరడానికి సిద్ధం అవుతుండడంతో.. శక్తివేల్, అతని బావ రంజిత్‌లు కొడవళ్లు తీసి మోహన్‌ను నరికి చంపారు. అది చూసి షాక్ అయిన శరణ్య తేరుకుని సహాయం కోసం అరిచేలోపే ఆమె మీద కూడా దాడి చేశారు. ఆమెను నరికి చంపేశారు.
అనంతరం శక్తివేల్, రంజిత్‌లు కుంభకోణం టౌన్ పోలీసులకు లొంగిపోయారు. తన బావమరిది రంజిత్‌తో శరణ్య పెళ్లి చేయాలని శక్తివేల్ యోచిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, అయితే అతని ఇష్టం లేకుండా శరణ్య మోహన్‌ని పెళ్లి చేసుకుందని.. దీంతో ఆగ్రహించిన శక్తివేల్.. నమ్మించి హత్యలు చేశాడని తేలింది. మోహన్, శరణ్య మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపరీక్ష నిమిత్తం కుంభకోణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తదుపరి విచారణ జరుగుతోంది.
తమిళనాడులో మరో లాకప్ డెత్.. రెండు నెలల్లో రెండో కేసు.. ఐదుగురు పోలీసులు సస్పెండ్
కాగా, జూన్ 10న కర్నాటకలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రేమకు పణంగా తన ప్రాణం పోతుందని.. అదీ తల్లిదండ్రుల చేతిలోనేనని ఆ యువతి ఊహించింది నిజమే అయ్యింది. Mysore Districtలోని పిరియాపట్టణ తాలూకా కగ్గుండి గ్రామంలో Dalit కులానికి చెందిన యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతుర్ని తల్లిదండ్రులు Murder చేసిన సంఘటన అంతటా సంచలనం సృష్టిస్తోంది. తల్లిదండ్రులు సురేష్, బేబీ తనని వదలరని, చంపడానికి కూడా వెనుకాడరు అని హతురాలు, పియుసి చదివే శాలిని(17) రాసిన సుదీర్ఘ లేఖను పోలీసులు కనుగొన్నారు.
హత్య జరగడానికి ముందు శాలిని అన్ని వివరాలతో పిరియా పట్టణ పోలీసులకు మూడు పేజీల letter రాసింది. తాను చనిపోతే అందుకు తల్లిదండ్రులే కారణమని.. నన్ను హత్య చేయడానికి వారు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని అందులో పేర్కొంది. తన జీవితంలో ఎలాంటి సంతోషం లేదని, తల్లిదండ్రులు చిత్రహింసలకు గురి చేసేవారిని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ తాను మరణిస్తే ప్రియుడు మంజునాథ్ కు ఎలాంటి సంబంధం లేదని తల్లిదండ్రులు మాత్రమే దీనికి కారణం అని స్పష్టం చేసింది.
ఏడాది కిందట ఒక పరువు హత్య..
కాగా, గత ఏడాది జూన్ లో ఒక పరువు హత్య మైసూరు జిల్లాలో జరిగింది. ఇతర కులాలకు చెందిన యువకుడిని ప్రేమిస్తోంది అని.. గాయత్రీ అనే యువతిని ఆమె తండ్రి జయరాం పొలంలో నరికి చంపి.. పోలీసులకు లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో జిల్లాలో పరువు హత్యలు పెరుగుతున్నాయని ఆందోళన నెలకొంది.