తమిళనాడులోని (army Chopper Crash) నీలగిరి కనుమల్లో చోటుచేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (bipin rawat) ఆయన సతీమణితోపాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో బ్రిగేడియర్ లఖ్విందర్ సింగ్ లిద్ధర్ (brigadier lakhwinder singh lidder) ఒకరు.
తమిళనాడులోని (army Chopper Crash) నీలగిరి కనుమల్లో చోటుచేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (bipin rawat) ఆయన సతీమణితోపాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో బ్రిగేడియర్ లఖ్విందర్ సింగ్ లిద్ధర్ (brigadier lakhwinder singh lidder) ఒకరు. హర్యానాలోని (haryana) పంచకులకు చెందిన లిద్ధర్ గతేడాదిగా బిపిన్ రావత్ వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఆయనకు పదోన్నతి లభించేది. సెకెండ్ జనరేషన్ ఆర్మీ అధికారిగా ఉన్న లిద్ధర్‌కు మేజర్ జనరల్‌గా పదోన్నతి కల్పించే ప్రక్రియ కొనసాగుతుండగానే దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించడం అందరినీ కలచివేస్తోంది. ఈ విషయాన్ని లిద్ధర్ సన్నిహితులు పేర్కొన్నారు. పదోన్నతి లభించగానే ఆయన బిపిన్ రావత్ సిబ్బంది బాధ్యతల నుంచి తప్పుకొని డివిజన్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించేవారని తెలిపారు.
జమ్ముకశ్మీర్ రైఫిల్స్‌లో (jammu kashmir rifles) విధులు నిర్వర్తించిన లిద్ధర్.. గతంలో రెజిమెంట్ రెండో బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. కజకిస్థాన్‌కు భారత్ తరఫున రక్షణ అధికారిగా పనిచేశారు. అంతేకాదు లిద్ధర్‌కు ఉగ్రవాద నిరోధక నిపుణుడిగా సైన్యంలో మంచి గుర్తింపు వుంది. దేశానికి చేసిన సేవలకు గానూ లిద్ధర్ సేన, విశిష్ఠ్ సేవా పతకాలు అందుకున్నారు. అంతేకాదు దేశంలోని అత్యంత తెలివైన.. ధైర్యవంతులైన ఆర్మీ అధికారుల్లో బ్రిగేడియర్ లిద్ధర్ ఒకరు అని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (rajyavardhan singh rathore) కొనియాడారు. ఈ ప్రమాదంలో తను ఒక గొప్ప స్నేహితుడిని కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లిద్ధర్.. రాథోడ్ కలిసి ఎన్‌డీఏలో శిక్షణ పొందారు.
undefined
కాగా.. ఆ హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ (Group Captain Varun Singh) ఒకరే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వెలింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రిలో వరుణ్ సింగ్‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే 45 శాతం కాలిన గాయాలు కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో వరుణ్ సింగ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్ కమాండ్ ఆస్పత్రికి తరలించారు అధికారులు. నిపుణులైన వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్ధితిని సమీక్షిస్తోంది.
వరుణ్ సింగ్ తండ్రి కేపీ సింగ్ స్వగ్రామం.. తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియాలో ఉంది. కేపీ సింగ్ ఆర్మీలో కల్నల్ స్థాయిలో ఉన్నప్పుడు రిటైర్డ్ అయ్యారు. యూపీ కాంగ్రెస్ నాయకుడు అఖిలేష్ ప్రతాప్ సింగ్.. వరుణ్ సింగ్‌కు బంధువు. ఈ ఏడాది ఆగస్టులోనే భారత ప్రభుత్వం వరుణ్ సింగ్ ను శౌర్య చక్ర అవార్డు (Shaurya Chakra Award) తో సత్కరించింది. గతేడాది తాను నడుపుతున్న యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ.. ధైర్య సాహసాలు, నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా ల్యాండ్ చేశారు. వరుణ్ సింగ్ ప్రస్తుతం ప్రమాదం జరిగిన సూలూర్ ఎయిర్ బేస్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు.