ఫ్రొఫెసర్ శివదాస్, దీపా బల్సావర్ కు BLBA-2021 అవార్డ్..

By team teluguFirst Published Dec 9, 2021, 6:37 PM IST
Highlights

బాలసాహిత్యంలో రచనలు చేసిన ప్రొఫెసర్ శివదాస్, చిత్రకారణి  దీపా  బల్సావర్ లు ఈ ఏడాది BLBA-2021 అవార్డుకు ఎంపికయ్యారు. 2016 నుంచి టాటా ట్రస్ట్ ఈ అవార్డు అందిస్తోంది. 

టాటా ట్ర‌స్ట్ ద్వారా అందించే బిగ్ లిటిల్ బుక్ అవార్డ్ (BLBA)కు 2021 సంవ‌త్స‌రానికి గాను ఈ ఏడాది ప్ర‌ముఖ బాల‌ల పుస్త‌క ర‌చయిత ప్రొఫెస‌ర్ ఎస్‌.శివ‌దాస్, ముంబాయికి చెందిన  దీపా బల్సావర్ లు ఎంపిక‌య్యారు. కేర‌ళ‌లోని  కొట్టాయంకు చెందిన ప్రొఫెసర్. ఎస్. శివదాస్ మలయాళంలో ప్ర‌ముఖ బాలల సాహిత్య ర‌చ‌యిత. బాల సాహిత్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న 200 వ‌ర‌కు పుస్త‌కాల‌ను ర‌చించారు.  బాల సాహిత్యంలో ఆయ‌న చేసిన కృషికి టాటా ట్ర‌స్ట్ అందించే BLBA 2021 అవార్డుకు ఎంపిక చేసింది. 
‘‘ఈ అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాల‌ల ర‌చ‌యిత‌గా నాకు ఇది కెరీర్‌లో కొత్త ప్రారంభం అని అన్నారు. “పిల్లల కోసం పుస్తకాలు తయారు చేయడం అనేది నాకు పెద్ద బాధ్యత. ఈ అవార్డు నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నేను చేసే ప‌నికి ఈ అవార్డు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.’’ అని చిత్రకారుల విభాగంలో అవార్డు అందుకున్న దీపా బల్సావర్ తెలిపారు. 
‘‘పిల్లల్లో పఠన సంస్కృతిని పెంపొందించడానికి, విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి భారతీయ భాషలలో మంచి సాహిత్యంచాలా కీలకం.  అందుకే బాలల సాహిత్యంలో, చిత్రకారుల విభాగంలో  కృషి చేసే వారికి అవార్డు ఇస్తున్నాం. అవార్డు గెలుచుకున్న విజేత‌లకు అభినంద‌న‌లు. వారి ఆ రంగాల్లో మ‌రింత కృషి చేస్తార‌ని భావిస్తున్నాం’’ అని టాటా ట్రస్ట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ అమృతా పట్వర్ధన్ తెలిపారు. 

హెలికాఫ్టర్ ప్రమాదం: బయటపడ్డ ఒకే ఒక్కవ్యక్తి.. వరుణ్ సింగ్‌ను బెంగళూరుకు తరలించిన ఆర్మీ

అవార్డు కోసం 490 ఎంట్రీలు..
టాటా ట్ర‌స్టు 2016 నుంచి ఈ అవార్డు లు అందిస్తోంది. భార‌తీయ భాషల్లో బాల‌ల సాహిత్యంలో విశేష కృషి చేసిన ర‌చ‌యిత‌ల‌కు, చిత్ర‌కారుల‌కు ప్ర‌తీ ఏటా ఈ అవార్డుల‌ను అందిస్తూ వ‌స్తున్నారు. ఈ ఏడాది ఈ బిగ్ లిటిల్ బుక్ అవార్డ్ (BLBA 2021) కోసం జూన్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 490 నామినేషన్లు వ‌చ్చాయి. అయితే మ‌ళ‌యాలం భాష‌లో ప్రొఫెస‌ర్ శివ‌దాస్ చేసిన ర‌చ‌న‌లకుగాను ఆయ‌న‌కు ఈ అవార్డు వ‌రించింది. 
 

click me!