హెలికాఫ్టర్ ప్రమాదం: బయటపడ్డ ఒకే ఒక్కవ్యక్తి.. వరుణ్ సింగ్‌ను బెంగళూరుకు తరలించిన ఆర్మీ

Siva Kodati |  
Published : Dec 09, 2021, 06:33 PM ISTUpdated : Dec 09, 2021, 07:37 PM IST
హెలికాఫ్టర్ ప్రమాదం: బయటపడ్డ ఒకే ఒక్కవ్యక్తి.. వరుణ్ సింగ్‌ను బెంగళూరుకు తరలించిన ఆర్మీ

సారాంశం

తమిళనాడు కునూరు సమీపంలో చోటుచేసుకున్న ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో (Army chopper crash) సీడీఎస్ జనరల్‌ బిపిన్ రావత్‌ దంపతుల సహా 13 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ (Group Captain Varun Singh) ఒకరే ప్రాణాలతో బయటపడ్డారు. 

తమిళనాడు కునూరు సమీపంలో చోటుచేసుకున్న ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో (Army chopper crash) సీడీఎస్ జనరల్‌ బిపిన్ రావత్‌ దంపతుల సహా 13 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ (Group Captain Varun Singh) ఒకరే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వెలింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రిలో వరుణ్ సింగ్‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే 45 శాతం కాలిన గాయాలు కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో వరుణ్ సింగ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్‌ కమాండ్‌ ఆస్పత్రికి తరలించారు అధికారులు. నిపుణులైన వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్ధితిని సమీక్షిస్తోంది.

Also ReadCDS Bipin Rawat: బిపిన్ రావత్ మంచినీళ్లు అడిగాడు.. రాత్రంతా నిద్ర పట్టలేదు.. ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..

వరుణ్ సింగ్ తండ్రి మాట్లాడుతూ.. 
గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తండ్రి కల్నల్ కేపీ సింగ్ (రిటైర్డ్) ఫోన్‌లో పిటిఐతో మాట్లాడుతూ.. “వరుణ్‌ను బెంగళూరుకు తరలిస్తున్నారు. నేను వెల్లింగ్టన్ చేరుకున్నాను’’ను అని తెలిపారు. వరుణ్ సింగ్ పరిస్థితిపై స్పందిస్తూ.. ఆ విషయం తానేమి చెప్పలేనని అన్నారు. ఖచ్చితంగా ఏమి తెలియడం లేదని పేర్కొన్నారు. ఇక, బుధవారం వరుణ్ తల్లిదండ్రులు Colonel K P Singh (retired), ఉమా‌లు ముంబైలో ఉన్నారు. ముంబై‌లోని చిన్న కుమారుడు తనూజ్ నివాసంలో ఉండగా వారికి ఈ ప్రమాద వార్త తెలిసింది. తనూజ్ కూడా నేవీలో లెఫ్టినెంట్ కమాండర్‌గా ఉన్నారు. 

వ‌రుణ్ సింగ్ తండ్రి కేపీ సింగ్ స్వగ్రామం.. తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియాలో ఉంది. కేపీ సింగ్ ఆర్మీ‌లో కల్నల్‌ స్థాయిలో ఉన్నప్పుడు రిటైర్డ్ అయ్యారు. యూపీ కాంగ్రెస్ నాయకుడు అఖిలేష్ ప్రతాప్ సింగ్.. వరుణ్ సింగ్‌కు బంధువు. ఈ ఏడాది ఆగస్టులోనే భారత ప్రభుత్వం వరుణ్ సింగ్ ను శౌర్య చక్ర అవార్డు (Shaurya Chakra Award) తో సత్కరించింది. గతేడాది  తాను నడుపుతున్న యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు  తలెత్తినప్పటికీ..  ధైర్య సాహసాలు, నైపుణ్యాన్ని ప్రదర్శించి  ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా ల్యాండ్ చేశారు. వరుణ్ సింగ్ ప్ర‌స్తుతం ప్ర‌మాదం జ‌రిగిన సూలూర్ ఎయిర్ బేస్‌లోని డిఫెన్స్ స‌ర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్‌గా ప‌నిచేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్