పెళ్లైన మూడు రోజులకే విడాకులు కావాలంటూ వధువు.. విషయం ఆరా తీస్తే..

Published : Sep 13, 2021, 12:36 PM ISTUpdated : Sep 13, 2021, 12:39 PM IST
పెళ్లైన మూడు రోజులకే విడాకులు కావాలంటూ వధువు.. విషయం ఆరా తీస్తే..

సారాంశం

 పెళ్లి తర్వాత అత్తింటికి వచ్చిన వధువు రెండ్రోజులు అక్కడ ఉంది. మూడో రోజు తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. అలా వెళ్లిన మూడు గంటలకు గౌతమ్‌కు ఫోన్ చేసి విడాకులు కావాలని అడిగింది.

వారికి పెళ్లి జరిగి కనీసం వారం రోజులు కూడా గడవలేదు. పెళ్లి జరిగిన మూడు రోజులకే పుట్టింటికి వెళ్లిన వధువు.. తనకు విడాకులు కావాలంటూ.. వధువు ఫోన్ చేసి తన భర్తకు చెప్పడం గమనార్హం. భార్య చెప్పిన మాటలకు షాకైన ఆ వరుడు.. అలా చెప్పడానికి కారణమేంటా అని ఆరా తీశాడు.

ఆమె మైనర్ అని, ఆమె పేరు కూడా వేరు అని అతడికి తెలిసింది.. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.. రాజస్థాన్‌లోని పెహర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

పెహర్‌కు చెందిన శశికాంత్ గౌతమ్‌కు గతేడాది సమీప బంధువు ద్వారా ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి నచ్చడంతో ఆమెను గౌతమ్ 2020, నవంబర్ 25న కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అత్తింటికి వచ్చిన వధువు రెండ్రోజులు అక్కడ ఉంది. మూడో రోజు తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. అలా వెళ్లిన మూడు గంటలకు గౌతమ్‌కు ఫోన్ చేసి విడాకులు కావాలని అడిగింది. షాకైన గౌతమ్ కారణం ఏంటని అడిగాడు. నువ్వు నాకు నచ్చలేదని, ఈ పెళ్లి తన ఇష్టప్రకారం జరగలేదని చెప్పింది. 

ఆ అమ్మాయి వివరాలను ఆరా తీసినపుడు గౌతమ్‌కు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ అమ్మాయి మైనర్ అని, పెళ్లి కోసం ఆమె వయసు రెండు సంవత్సరాల ఎక్కువగా చెప్పారని తెలిసింది. ఆ మేరకు ఆధార్ కార్డులో పుట్టిన సంవత్సరాన్ని మార్పించారని తేలింది. వయసు మాత్రమే కాదు.. ఆమె పేరును కూడా తనకు తప్పు చెప్పారని తెలుసుకున్నాడు. దీంతో సదరు యువకుడు గత శనివారం పోలీసులను ఆశ్రయించాడు. తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడు.  

PREV
click me!

Recommended Stories

Jio Recharge Plans : కేవలం రూ.11 కే 10GB,రూ.49 కే 25GB హైస్పీడ్ డేటా
Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu