వరుడికి సిగరెట్ వెలిగించిన వధువు కుటుంబం.. ఇదెక్కడి ఆచారం..?

Published : Feb 18, 2023, 10:23 AM IST
  వరుడికి సిగరెట్ వెలిగించిన వధువు కుటుంబం.. ఇదెక్కడి ఆచారం..?

సారాంశం

ఓ వధువు కుటుంబం.. వరుడికి ఆహ్వానం పలికేందుకు నోట్లో సిగరెట్ పెట్టి మరీ దగ్గరుండి వాళ్లే వెలిగించారు

పొగతాగడం  ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ..... చాలా మంది ఆ అలవాటు నుంచి బయటపడలేరు. అయితే... మన ఇంటి అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు మాత్రం.... అల్లుడికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్మోకింగ్ అలవాటు ఉండకూడదనే ఎవరైనా కోరుకుంటారు. కానీ ఓ వధువు కుటుంబం.. వరుడికి ఆహ్వానం పలికేందుకు నోట్లో సిగరెట్ పెట్టి మరీ దగ్గరుండి వాళ్లే వెలిగించారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే....

పెళ్లిలో పెళ్లికొడుకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  పెళ్లి రోజున వధువు తల్లిదండ్రులు వరుడికి సిగరెట్ వెలిగించి స్వాగతం పలుకుతున్నారు. ఈ వీడియోను బ్లాగర్ జూహి కె పటేల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనికి 5.7 మిలియన్ వ్యూస్ ఉన్నాయి.

 

వైరల్ వీడియోలో వరుడు మంచం మీద కూర్చున్నప్పుడు అతని మామ, అత్తగారు అతనికి సిగరెట్ వెలిగించారు. జూహి ఒక వివాహానికి అతిథిగా హాజరైన ఆమె దీనిని చూసింది. "సిగరెట్,  పాన్‌తో పాటుగా అత్తగారు వరుడిని స్వీట్‌లతో స్వాగతించే కొత్త వివాహ సంప్రదాయాన్ని ఇప్పుడే చూశాను" అంటూ క్యాప్షన్ పెట్టడం విశేషం.

 “ఇది దక్షిణ గుజరాత్‌లోని కొన్ని గ్రామాలలో అనుసరించే పాత సంప్రదాయం. అతను స్మోక్ కూడా చేయడు, వాళ్లు కూడా దానిని వెలిగించలేదు. కేవలం యాక్టింగ్ కోసం మాత్రమే ఇలా చేశారు. దీని గురించి బయపడాల్సిన అవసరం లేదు.’’ అంటూ కింద కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?