
ఈ ప్రపంచంలో తల్లీ, బిడ్డకు మధ్య ఉన్న అనుబంధం వెలకట్టలేనిది. కేవలం మనుషులు మాత్రమే కాదు...జంతువులు కూడా...తల్లిప్రేమను చూపించడంలో ముందుంటాయి. ఇలాంటి వీడియోలు గతంలో మనం చాలా సార్లు చూసే ఉంటాం. తాజాగా...తల్లి, బిడ్డల మధ్య అనుబంధాన్ని పెంచే మరో వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి ఏనుగు బురదలో చిక్కుకుంటే.... ఆ తల్లి వదిలి వెళ్లడానికి పిల్ల ఏనుగు చేసిన ప్రయత్నం.. నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని IFS అధికారి సుశాంత నందా షేర్ చేయడం గమనార్హం.
ఫారెస్ట్ అధికారులు ఏనుగును గుర్తించే సమయానికి అది బాగా బురదలో ఇరుక్కుపోయింది.వారు ఏనుగును రక్షించడానికి ప్రయత్నిస్తుండగా... పక్కనే ఉన్న పిల్ల ఏనుగు తల్లి దగ్గర నుంచి దూరంగా వెళ్లడానికి కూడా ఇష్టపడకపోవడం గమనార్హం. అధికారులు ఏనుగు పిల్లను శాంతింపజేసి, సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత తల్లిని సురక్షితంగా లాగారు.
కాగా... ఈ వీడియో చాలా ఎమోషనల్ గా ఉందని... తాను మళ్లీ మళ్లీ లూప్ లో చూశానంటూ... ఆ ఫారెస్ట్ అధికారి క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియో 148వేలకు పైగా వ్యూస్, టన్నుల కొద్దీ కామెంట్ల వర్షం కురిసింది. తల్లి, బిడ్డలను తిరిగి కలపడానికి చాలా కృషి చేసినందుకు రక్షకులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. తల్లి, బిడ్డల మధ్య అనుబంధాన్ని చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.