నిక్కీ యాదవ్ మర్డర్: ఒకవైపు పెళ్లితంతు.. మరోవైపు మర్డర్.. గర్ల్‌ఫ్రెండ్‌ను చంపి ఏమీ ఎరుగనట్టే అదే రోజు పెళ్లి

Published : Feb 16, 2023, 06:34 PM ISTUpdated : Feb 16, 2023, 07:19 PM IST
నిక్కీ యాదవ్ మర్డర్: ఒకవైపు పెళ్లితంతు.. మరోవైపు మర్డర్.. గర్ల్‌ఫ్రెండ్‌ను చంపి ఏమీ ఎరుగనట్టే అదే రోజు పెళ్లి

సారాంశం

ఢిల్లీలో మరో మర్డర్ కేసు శ్రద్ధా వాకర్ హత్యను గుర్తుకు తెస్తున్నది. నిక్కీ యాదవ్‌నూ ఆమె లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్న బాయ్ ఫ్రెండే పొట్టనబెట్టుకున్నాడు. నిక్కీతో సంబంధంలో ఉంటూనే ఆమెకు తెలియకుండా మరో యువతితో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో గొడవ జరిగింది. ఆమెను చంపేసి మరుసటి  రోజే ఏమీ జరగనట్టు పెళ్లి చేసుకున్నాడు.  

న్యూఢిల్లీ: నిక్కీ యాదవ్ హత్య కేసు మరోసారి శ్రద్ధా వాకర్ హత్యను గుర్తుకు తెస్తున్నది. దేశవ్యాప్తంగా ఆమె మర్డర్ కలకలం రేపుతున్నది. నాలుగేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్న బాయ్‌ఫ్రెండ్ ఆమెకు తెలియకుండా మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. తర్వాతి రోజే పెళ్లి. ఈ విషయం తెలుసుకున్న గర్ల్‌ఫ్రెండ్ నిలదీయడంతో గొడవ జరిగింది. ఈ ఘర్షణలోనే ఆగ్రహంతో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆమె డెడ్ బాడీని వారి ధాబా దగ్గర కారులోనే ఉంచి ఏమీ ఎరుగనట్టు పెళ్లి చేసుకోవడానికి వెళ్లాడు. బంధువులతో కలిసి స్టెప్పులు వేశాడు. పెళ్లి చేసుకుని రాత్రి మళ్లీ బయటకు వచ్చి గర్ల్ ఫ్రెండ్ బాడీని ఓ నదిలో లేదా కెనాల్‌లో పడేయడానికి ధాబాకు వచ్చాడు. ఒక వైపు పెళ్లి తంతులో పాల్గొంటూనే అదే సమయంలో ఇంకో వైపు గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేయడం, ఆమె డెడ్ బాడీని మాయం చేసే ప్లాన్లు వేయడం వంటివి చేశాడు.

24 ఏళ్ల సాహిల్ గెహ్లాట్, 23 ఏళ్ల నిక్కీ యాదవ్‌లు 2018లో స్నేహితులు అయ్యారు. ఓ ఫార్మస్యూటికల్ కాలేజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుండగా పరిచయం అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అనంతరం లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో అడుగపెట్టారు. కానీ, నిక్కీ యాదవ్‌కు చెప్పకుండా.. ఆమెకు తెలియకుండా సాహిల్ గెహ్లాట్ ఫిబ్రవరి 9న మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నాడు. ఈ ఎంగేజ్‌మెంట్‌లో జోరుగా హుషారుగా డ్యాన్స్ చేస్తూ వీడియోలో కనిపించాడు. మరుసటి రోజే ఆమెతో సాహిల్ పెళ్లి.

ఈ గ్యాప్‌లో సాహిల్.. నిక్కీ వద్దకు వచ్చాడు. ఆమెను చంపేశాడు. మళ్లీ ఏమీ ఎరుగనట్టే మరుసటి రోజు పెళ్లి ఎంగేజ్‌మెంట్ చేసుకున్న యువతితో పెళ్లి చేసుకున్నాడు. అసలు అతను ఒకరిని చంపేసినట్టే ఆ పెళ్లి తంతువుల్లో కనిపించలేదు. ఏమీ జరగనట్టే పెళ్లి తంతులో పాల్గొన్నాడు.

తన ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం ముగిసిన తర్వాత సాహిల్ గెహ్లాట్ తన కజిన్ కారు తీసుకుని నిక్కీ ఇంటికి అర్ధరాత్రి దాటినాక 1 గంటలకు వెళ్లాడు. అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లుతున్న సాహిల్ సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు. సుమారు ఉదయం 5 గంటలకు వారు మళ్లీ బయటకు వెళ్లుతూ కనిపించారు. అదే కారులో వారు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. గోవా వెళ్లే ట్రైన్ కోసం వారు బహుశా వెళ్లి ఉంటారు. నిక్కీ యాదవ్ గోవాకు వెళ్లాలనుకుంది. కానీ, సాహిల్ వారికి టికెట్లు పొందలేకపోయాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వారు హిమాచల్ ప్రదేశ్ వెళ్లడానికి బస్ స్టేషన్‌కు వెళ్లారు. కానీ, బస్ టికెట్లు కూడా వారికి దొరకలేవు. నిక్కీని వదిలించుకోవడానికి సాహిల్ ఆమెను తప్పుదారి పట్టించడానికి ఈ ప్లాన్లు వేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: శ్రద్ధా వాకర్ ఎముకలను దంచి పౌడర్ చేశాడు.. చివరిగా మూడు నెలల తర్వాత తలను పడేశాడు: ఢిల్లీ పోలీసులు

దీంతో కాశ్మీర్ గేటు వద్ద కారు పార్క్ చేసి సుమారు ఐదు గంటలపాటు వాదించుకున్నారు.

తన మైండ్‌లో రెండూ అంశాలు సాగుతున్నాయని సాహిల్ చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇదంతా సాహిల్ వర్షన్ అని, ఆయన చెప్పిన వాటికి సీసీటీవీ ఫుటేజీ, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ సరిపోతున్నాయా? లేదా? కూడా పరిశీలించాల్సి ఉన్నదని వివరించారు. ఆయన వాదననూ తాము పరిశీలిస్తున్నామని, ఎందుకంటే ఎంగేజ్‌మెంట్ రోజున అతను చాలా ఫన్‌గా ఉన్నట్టు తెలిసిందని పేర్కొన్నారు.

పెళ్లి రోజున కుటుంబ సభ్యులు సాహిల్‌కు ఫోన్లపై ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఉదయం 9 గంటల ప్రాంతంలో సాహిల్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను చార్జింగ్ కేబుల్‌తో ఉరేసి చంపేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని కారులో ముందు సీటులో కింద కుక్కుసి 40 కిలోమీటర్ల దూరంలోని రోడ్డు పక్కన ఉండే వారి కుటుంబానికి చెందిన ధాబా వద్దకు తీసుకెళ్లాడు. ధాబాలో కారు ఉంచి ధాబాకు తాళం వేసి పెళ్లి చేసుకోవడానికి ఇంటికి వెళ్లిపోయాడు.

పెళ్లి తర్వాత అందరూ పడుకున్నాక డెడ్ బాడీని మాయం చేయడానికి తెల్లవారుజామున 3.30 గంటలకు మరో కారులో ధాబాకు వెళ్లాడు. ఆమె డెడ్ బాడీని ఓ నదిలో లేదా మురుగు కాలువలో పడేయాలన్నది సాహిల్ ప్లాన్ అని పోలీసులు వివరించారు. కారులో నుంచి డెడ్ బాడీని ధాబాలోని ఫ్రిడ్జీలోకి మార్చాడు.

నిక్కీ మొబైల్ ఫోన్‌ను సాహిల్ తీసుకుని అందులోని డేటా మొత్తం డిలీట్ చేశాడు. వారి వాగ్వాదం గురించిన చాట్ మొత్తం తొలగించాడు. పోలీసులు ఆ డేటాను రిట్రైవ్ చేసుకున్నారు.

నిక్కీ యాదవ్ కనిపించడం లేదని పొరుగు వారు రిపోర్ట్ చేసిన తర్వాత ఫిబ్రవరి 14న (నాలుగు రోజుల తర్వాత) ఈ హత్యను పోలీసులు కనుగొన్నారు. సాహిల్ గెహ్లాట్‌ను పోలీసులు ట్రాక్ చేసి పట్టుకున్నారు.

సాహిల్ గెహ్లాట్ నిక్కీ యాదవ్‌తో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని  తమకు తెలియదని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం