ఏరో ఇండియా 2023: డ్రోన్ వ్య‌వ‌స్థ‌లో గేమ్ ఛేంజ‌ర్.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా స్వ‌దేశీ 'త‌ప‌స్' ..!

Published : Feb 16, 2023, 04:48 PM IST
ఏరో ఇండియా 2023:  డ్రోన్ వ్య‌వ‌స్థ‌లో గేమ్ ఛేంజ‌ర్.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా స్వ‌దేశీ 'త‌ప‌స్' ..!

సారాంశం

Bengaluru: అత్యాధునిక యూఏవీ కోసం భారత్ ఇజ్రాయెల్ పై ఆధారపడుతోంది. అయితే, ఇకపై ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని త‌గ్గిస్తూ డీఆర్డీవో భార‌త్ అమ్ముల‌పొదిలోకి మ‌రో ఆస్త్రాన్ని అందించింది.  త్రివిధ దళాల ఇస్టార్ (ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, టార్గెట్ అక్విజిషన్, ట్రాకింగ్- నిఘా) అవసరాలకు అనుగుణంగా డీఆర్డీవో త‌ప‌స్ డ్రోన్ ను అభివృద్ది చేసింది.   

Aero India 2023: ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని త‌గ్గిస్తూ డీఆర్డీవో భార‌త్ అమ్ముల‌పొదిలోకి మ‌రో ఆస్త్రాన్ని అందించింది. అత్యాధునిక యూఏవీ కోసం భారత్ ఇజ్రాయెల్ పై ఆధారపడుతోంది. త్రివిధ దళాల ఇస్టార్ (ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, టార్గెట్ అక్విజిషన్, ట్రాకింగ్- నిఘా) అవసరాలకు అనుగుణంగా డీఆర్డీవో త‌ప‌స్ డ్రోన్ ను అభివృద్ది చేసింది. తపస్ కు సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్ ఉంది. ఇది త‌న‌ను తాను ర‌క్షించే చ‌ర్య‌ల్లో చురుగ్గా ఉటుంది. యూఏవీ సెన్సార్లు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. ఇది అత్యంత వేగంగా క‌దులుతూ.. వ్యూహాత్మక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మొత్తంగా ఇది గేమ్ ఛేంజ‌ర్ కాబోతోంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. 

ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో జ‌రుగుతున్న ఏరో ఇండియా 2023 ఏయిర్ షో త‌ప‌స్ ను డీఆర్డీవో ప్ర‌ద‌ర్శించింది. డ్రోన్ షో లో ఇది ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచింది. బెంగళూరులో ఏరో ఇండియా ఈ ఎడిషన్ లో డ్రోన్లు కేంద్రబిందువుగా మారాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన తపస్-బీహెచ్ యలహంక వైమానిక స్థావరంలో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆర్మేనియా-అజర్బైజాన్ వివాదంతో పాటు చైనా-పాకిస్తాన్లు మానవరహిత వైమానిక వాహనాల (యూఏవీ) సంయుక్తంగా వీటి ఉత్పత్తిలో నిమగ్నమైన నేపథ్యంలో భారత్ కూడా డ్రోన్ల కొనుగోలుపై దృష్టి సారించింది. ఇటీవలి నెలల్లో, పాకిస్తాన్ అనేక సందర్భాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి-మాదకద్రవ్యాలతో కూడిన డ్రోన్లను భారత భూభాగంలోకి పంపుతుండ‌టం క్ర‌మంగా పెరుగుతోంది.

ఇలాంటి స‌మ‌యంలో స్వ‌దేశీ టెక్నాల‌జీతో ఇత‌ర దేశాల డ్రోన్ల కు స‌వాల్ విసిరే విధంగా డీఆర్డీవో త‌ప‌స్ బీహెచ్ ను అభివృద్ది చేసింది. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా 2023 సందర్భంగా డీఆర్డీవోలోని డైరెక్టర్ జనరల్-ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ (ఈసీఎస్) బీకే. దాస్ తో ఏషియానెట్ న్యూస్ మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

త‌ప‌స్ బీహెచ్ గురించి మాట్లాడుతూ.. "తపస్ అనేది మానవరహిత ఏరియల్ వెహికిల్, దీనిని మా ల్యాబ్ ఏడీఈ వివిధ ప్రయోగశాలల సహకారంతో అభివృద్ధి చేసింది. ముఖ్యంగా డీఈఎల్ దీనికి పూర్తి డేటా లింక్ ఇవ్వబడింది. ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (IRDE) ఎలక్ట్రో-ఆప్టిక్స్‌ను అభివృద్ధి చేస్తుంది. అలాగే, ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE) రాడార్‌లను అభివృద్ధి చేస్తుంది. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (DLRL) EWS సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తుంది. ఇది ప్రాథమికంగా మానవరహిత వ్యవస్థ.. దీనికి పైలట్ అవసరం లేదు. చాలా ఎక్కువ ఎత్తులో వివిధ ప్రదేశాలలో అత్యంత వేగంగా ఇది ప్రయాణించగలదు" అని బీకే.దాస్  తెలిపారు. 

పూర్తి ఎలక్ట్రానిక్స్ పై కమాండ్ అండ్ కంట్రోల్ కూడా దీనికి ఉంటుంద‌ని తెలిపారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం నిఘా ఉంచే ప్రాంతాలలో ఎగురుతుంది. హై-డెఫినిషన్ వీడియోలను అందిస్తుందన్నారు. సింథటిక్ అపెర్చర్ రాడార్ చుట్టుపక్కల ఉన్న అన్ని వస్తువులను ట్రాక్ చేయగలదనీ, ఇది గ్రౌండ్స్ నుండి రాడార్ చిత్రాలను తీసుకోగ‌ల‌ద‌ని తెలిపారు. అలాగే, EWS వ్యవస్థ జామింగ్ అనే కాన్సెప్ట్ తో పనిచేస్తుంద‌నీ, దానికి స‌మ‌స్య‌ను క‌లిగించే ఏ రేడియేషన్ అయినా అది జామ్ చేస్తుంద‌ని తెలిపారు. త‌ప‌స్ లో సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్ కూడా ఉంద‌నీ, త‌న‌ను తాను ఇది ర‌క్షించుకోగ‌ల‌ద‌నీ, తపస్ సెన్సార్లు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయ‌ని తెలిపారు. ఇప్ప‌టికే ప‌లు దేశాలు త‌ప‌స్ పై ఆస‌క్తిగా ఉన్నాయ‌నీ, చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతున్నాయ‌ని దాస్ వెల్ల‌డించారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?