
న్యూఢిల్లీ : కాంగ్రెస్ వడ్గామ్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీని గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని పాలన్‌పూర్ సర్క్యూట్ హౌస్ నుండి గత రాత్రి 11:30 గంటల ప్రాంతంలో అస్సాం పోలీసులు అరెస్టు చేశారని మేవానీ టీమ్ తెలిపారు.
అతన్ని రోడ్డు మార్గంలో అహ్మదాబాద్‌కు తీసుకువెళుతున్నారు, అక్కడి నుండి రైలులో అస్సాంలోని గౌహతికి తీసుకువెళతారు. "పోలీసులు ఇంకా ఎఫ్‌ఐఆర్ కాపీని మాకు ఇవ్వలేదు. మేవానీపై అస్సాంలో నమోదైన కొన్ని కేసుల గురించి ప్రాథమికంగా మాకు సమాచారం అందించారు" అని మేవానీ టీమ్ తెలిపింది.
గుజరాత్ కాంగ్రెస్ నేత, వడ్గామ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ చేసిన ఓ ట్వీట్ విషయంలో ని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో పాలన్‌పూర్ సర్క్యూట్ హౌస్ వద్ద పోలీసులు అతడిని అరెస్టు చేసి అస్సాంకు తరలిస్తున్నారు.
ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, మద్దతుదారులు ఈరోజు ఏప్రిల్ 21వ తేదీన దేశ రాజధానిలో 'రాజ్యాంగాన్ని రక్షించండి, దేశాన్ని రక్షించండి' అనే నినాదాలతో నిరసన తెలుపనున్నారు.