స‌రిహ‌ద్దుల వ‌ద్ద పాకిస్థాన్ డ్రోన్ క‌ల‌క‌లం.. కూల్చివేసిన భారత సైన్యం

Published : Nov 09, 2022, 05:18 PM IST
స‌రిహ‌ద్దుల వ‌ద్ద పాకిస్థాన్ డ్రోన్ క‌ల‌క‌లం.. కూల్చివేసిన భారత సైన్యం

సారాంశం

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కూల్చివేసింది. మంగళవారం రాత్రి 11.25 గంటల ప్రాంతంలో ఫిరోజ్‌పూర్‌లోని గండు కిల్చా గ్రామం సమీపంలో పాకిస్తాన్ నుండి భారత భూభాగంలోకి అనుమానాస్పదంగా డ్రోన్ చొచ్చుక వచ్చినట్టు గుర్తించారు.   

పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్‌ కలకలం సృష్టించింది. ఫిరోజ్‌పూర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో అనుమానస్పదంగా సంచరిస్తున్న ఓ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూల్చివేశారు. ఫిరోజ్‌పూర్‌లోని గండు కిల్చా గ్రామం సమీపంలో మంగళవారం రాత్రి బీఎస్ఎఫ్,పోలీసు సిబ్బంది సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పాకిస్థాన్‌ వైపు నుంచి  డ్రోన్‌ భారత్‌లోకి చొచ్చుకొచ్చింది.

భారత భూభాగంలోకి ప్రవేశించిన అనుమానిత డ్రోన్ కు గమనించిన  బీఎస్ఎఫ్ కు చెందిన 136 బెటాలియన్ వెంటనే అప్రమత్తమై.. ఆ డ్రోన్‌ను కూల్చివేసింది. ఈ ఘటన మంగళవారం రాత్రి 11.25 గంటల ప్రాంతంలో ఫిరోజ్‌పూర్‌లోని గండు కిల్చా గ్రామ సమీపంలోని ప్రాంతంలో చోటు చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ ప్రకటించింది. భారత భూభాగంలోకి ప్రవేశించిన అనుమానిత ఎగిరే వస్తువు లేదా డ్రోన్ శబ్దం వినిపించిందని ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. చొరబాటును అడ్డుకునే ప్రయత్నంలో BSF దళాలు డ్రోన్‌పై కాల్పులు జరిపాయని ప్రకటించింది.  ఈ క్రమంలో నేలకూలిన హెక్సా-కాప్టర్(డ్రోన్‌)ను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన తరువాత  ఆ ప్రాంతంలో భద్రత బలాగాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. పాక్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత భద్రత బలగాలు.. 

గతంలోనూ పలు ఉగ్ర కార్యక్రమాలు 

>> అక్టోబర్ 17, 2022న రాత్రి 8 గంటల సమయంలో.. అమృత్‌సర్ సెక్టార్‌లోని కలాం డోగర్ పోస్ట్ సమీపంలో బీఎస్ఎఫ్  జవాన్లు డ్రోన్‌ను కూల్చివేశారు. అలాగే..  అక్టోబర్ 14న అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని రామదాస్ ప్రాంతంలో పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్‌ను బీఎస్ఎఫ్ సిబ్బంది కూల్చివేశారు.

>> అక్టోబర్ 1, 2019న బీఎస్ఎఫ్, ఎస్టీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో AK-47, కాట్రిడ్జ్‌లతో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. అలాగే..2019 సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో మామ్‌డోట్ ప్రాంతం నుండి ఐదు AK-47 రైఫిల్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

>> సెప్టెంబర్ 13, 2019న పఠాన్‌కోట్‌లో ఆరు ఏకే-56 రైఫిల్స్, రెండు AK-47 రైఫిళ్లు, ఆరు మ్యాగజైన్‌లు,180 కాట్రిడ్జ్‌లను తరలిస్తున్న ఓ ట్రక్కును అమృత్‌సర్ లో  భద్రత బలగాలు పట్టుకున్నాయి.

>> అక్టోబరు 6,2011న ఖేమ్‌కరన్‌లోని  అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని మహ్మద్ దగ్గర ఒక చైనీస్ పిస్టల్,రెండు మ్యాగజైన్లు , 14 కాట్రిడ్జ్‌లను భద్రత సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

>> అక్టోబరు 24, 2011 న ఫాజిల్కా సరిహద్దు గ్రామమైన హస్తక్లాన్‌లో స్మగ్లర్ నుంచి రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్‌లు, 40 కాట్రిడ్జ్‌లు, 58 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.

>> ఫిబ్రవరి 4,2012న అమర్‌కోట్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ స్మగ్లర్ నుంచి ఒక పిస్టల్,మ్యాగజైన్, ఎనిమిది కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

>> సెప్టెంబర్ 12, 2020న ఫిరోజ్‌పూర్‌ లోని మమ్‌డోట్‌ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ఓ పొలంలో ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్‌లో మూడు ఏకే-47 రైఫిళ్లు, ఆరు మ్యాగజైన్‌లు, అదే రైఫిల్‌కు చెందిన 91 కాట్రిడ్జ్‌లు, టూ-ఎం రెండు రైఫిళ్లు, నాలుగు మ్యాగజైన్‌లు, ఆ రైఫిల్‌కు చెందిన 57 కాట్రిడ్జ్‌లతో పాటు రెండు పిస్టల్స్ (చైనా), 20 కాట్రిడ్జ్‌లు లభించాయి.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌