13 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఫోన్లలో చిత్రీకరణ..  నిందితులంతా 13 నుంచి 15 ఏళ్ల లోపు వారే. .

By Rajesh KarampooriFirst Published Nov 9, 2022, 4:08 PM IST
Highlights

అస్సాంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కరీంగంజ్‌లో నివసిస్తున్న ఓ 13 ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించి.. ఇతరులకు షేర్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పిల్లలపై సినిమాలు,ఇంటర్ నెట్, సోషల్ మీడియా ప్రభావం ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి  చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే.. వారు ఏం చేస్తున్నారో.. ఎవ్వరికీ తెలియడం లేదు. అలాగే.. ఇంటర్ నెట్ లో పిల్లలు చేస్తున్న పనులను కనిపెట్టడంలో తల్లిదండ్రులు కూడా విఫలమవుతున్నారు. ఫలితంగా దారుణాలకు పాల్పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో అస్సాంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కరీంగంజ్‌లో 13 ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించి.. ఇతరులకు షేర్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ అస్సాంలోని రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంగంజ్‌లో స్థానికంగా నివసించే..  ఆరుగురు యువకులు ఓ మైనర్ బాలిక కన్నేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికతో మాటలు కలిపి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఆ బాలికపై దాడి చేసి..  ఒక్కరి తర్వత ఒక్కరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆ దుండగులు ఆ దారుణాన్ని తమ ఫోన్‌లలో చిత్రీకరించారు. నానా చిత్ర హింసలకు గురి చేశారు. జరిగిన విషయాన్ని బయటకు చెప్పితే.. చంపేస్తామని బెదిరించారు. 

ఆ ఘటనతో బాలిక షాక్‌కు గురైంది. తనపై జరిగిన దాడిని ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయింది. కూతురి మానసిక స్థితిలో మార్పు గమనించిన తల్లిదండ్రులు.. ఏం జరిగిందో  ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తనపై జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు సోమవారం నాడు కేసు నమోదు చేశారు." అని సీనియర్ పోలీసు అధికారి పార్థ ప్రతిమ్ దాస్ తెలిపారు

ఈ కేసును సీనియర్ గా తీసుకున్న పోలీసులు మంగళవారం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా 13 నుంచి 15 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారానికి సంబంధించిన వీడియోను నిందితులు పలువురికి షేర్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసి నిందితులను జువైనల్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు,నిందితులందరూ టీ తోట కార్మికుల కుటుంబాలకు చెందినవారు.

click me!