సరిహద్దులో పెరుగుతున్న చొరబాటు.. అప్రమత్తమైన బీఎస్ఎఫ్.. ఒకరి హతం..మరొకరి అరెస్ట్

By Rajesh KarampooriFirst Published Nov 22, 2022, 3:33 PM IST
Highlights

సరిహద్దు భద్రతా దళం మంగళవారం తెల్లవారుజామున జమ్మూ సరిహద్దులోని అంతర్జాతీయ సరిహద్దు (IB)లో అక్రమ చొరబాటు ప్రయత్నాలను అడ్డగించింది. ఈ క్రమంలో ఓ చొరబాటుదారుడిని హతం చేయగా.. మరొకరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

జమ్మూకశ్మీర్: కాశ్మీర్ లోయలో మంచు కురుస్తున్న వేళ చొరబాటు యత్నాలు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాదులు జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా అక్రమ చొరబాటు ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన భారత సరిహద్దు భద్రతా దళం.. జమ్మూలోని సాంబా సెక్టార్‌లో చొరబాటు ప్రయత్నాలను విఫలం చేసింది. ఈ క్రమంలో ఒక చొరబాటుదారుని హతం చేసి.. ఒక చొరబాటుదారుడు సజీవంగా పట్టుకుంది.

జమ్మూలోని సాంబా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో సరిహద్దు వెంబడి మోహరించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది పాకిస్థాన్ చేసిన రెండు చొరబాటు ప్రయత్నాలను విఫలం చేసింది. మొదటి కేసు జమ్మూలోని అర్నియా సెక్టార్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ సరిహద్దులో మోహరించిన జవాన్లు సోమవారం,మంగళవారం మధ్య రాత్రి కొన్ని అనుమానాస్పద కదలికలను గమనించారు. సరిహద్దులో గస్తీ కాస్తున్న  జవాన్లు పాకిస్తాన్ వైపు నుండి భారత సరిహద్దు వైపు వేగంగా వస్తున్న వ్యక్తిని చూశారు. సరిహద్దులో విధుల్లో ఉన్న జవాన్లు ఈ వ్యక్తిని ఆగమని ఆదేశించారు. కానీ, ఆ చొరబాటుదారు..  వేగంగా భారత సరిహద్దు వైపు రావడంతో జవాన్లు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఘటన సాంబా సెక్టార్‌లోని రామ్‌ఘర్ ప్రాంతంలోని సరిహద్దులో చోటు చేసుకుంది. చొరబాటుకు ప్రయత్నించిన నిందితుడిని బీఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నమని అధికారులు తెలిపారు. 

సరిహద్దుల్లో అడుగడుగునా నిఘా  

కాశ్మీర్ లోయలో మంచు కురుస్తున్న నేపథ్యంలో జమ్మూ లోని చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుంది. ఈ చొరబాట్లను ఎదుర్కొవడానికి BSF సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. పాక్ ఎంత ప్రయత్నించినా అడ్డుకునేలా సరిహద్దుల్లో నిర్వాకం ఉందని బీఎస్ఎఫ్ ఐజీ తెలిపారు. జమ్మూలోని సాంబాలో సోమవారం మరియు మంగళవారం మధ్య రాత్రి జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ..జమ్మూ ఫ్రాంటియర్, BSF ఐజి, సరిహద్దు ఆవల నుండి అనుసరించిన వ్యూహాలని పేర్కొన్నారు. సరిహద్దులో అడుగడునా పటిష్టమైన నిఘా ఉందని పేర్కొన్నారు. 

click me!