కరోనాకు చికిత్స తీసుకొంటున్న ఓ ఖైదీని వెంటనే కస్టడీకి తీసుకోవాలని నాగపూర్‌లోని ముంబై హైకోర్టు బెంచ్ ఆదేశించింది. ఖైదీ సరెండర్ కాకపోతే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది హైకోర్టు.
ముంబై:కరోనాకు చికిత్స తీసుకొంటున్న ఓ ఖైదీని వెంటనే కస్టడీకి తీసుకోవాలని నాగపూర్‌లోని ముంబై హైకోర్టు బెంచ్ ఆదేశించింది. ఖైదీ సరెండర్ కాకపోతే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది హైకోర్టు.
ముంబైకి చెందిన 39 ఏళ్ల ఖైదీ ఓ బిల్డర్ ను హత్య చేశాడు. ఈ కేసులో ఆయనకు జీవిత శిక్ష పడింది. నాగపూర్ సెంట్రల్ జైలులో ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుండి పర్మిషన్ తీసుకొని జైలు నుండి ఆయన బయటకు వచ్చాడు. మార్చి 22వ తేదీన జైలుకు వెళ్లాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.
ముంబై నుండి నాగపూర్ మధ్య 850 కి.మీ. దూరం. ఇంత దూరం ప్రయాణం చేయాలంటే అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.జైలుకు వచ్చేందుకు తాను అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్టుగా ఆ ఖైదీ కోర్టుకు తెలిపారు.
ప్రస్తుతం తాను ఠాణేలోని తన ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నట్టుగా ఖైదీ చెబుతున్నాడు. తాను ఈ పాస్ కు ధరఖాస్తు చేసుకొన్నా అధికారులు తిరస్కరించారు. అంతేకాదు తాను స్థానికంగా ఉన్న తలోజా, ఠాణే జైళ్ల వద్దకు వెళ్లి తనను అదుపులోకి తీసుకోవాలని కోరినా కూడ వారు తీసుకోలేదన్నారు. నాగపూర్ కే వెళ్లాలని చెప్పడంతో తాను ఇంటి వద్దే ఉన్నట్టుగా ఆయన చెప్పారు.
also read:పెన్నా తీరంలో కరోనా డెడ్‌బాడీల పూడ్చివేత: విచారణకు ఆదేశం
జైలు అధికారులకు తాను ఈ మెయిల్స్ తో పాటు, ఉత్తరాలు రాసినట్టుగా ఆయన హైకోర్టుకు వివరించారు. జూన్ 16న ముంబై హైకోర్టు నాగపూర్ బెంచ్ జైలులో లొంగిపోవాలని తన క్లయింట్‌ను ఆదేశించిందని ఖైదీ తరఫు న్యాయవాది ఆకాశ్ వెల్లడించారు.
అప్పటికే తనకు కరోనా సోకిందని తెలియని ఖైదీ అందుకు ఒప్పుకున్నాడని తెలిపారు.మరుసటి రోజే అతనికి కోవిడ్–19 పాజిటివ్ అని తేలిందని వివరించారు. దీంతో మళ్లీ దరఖాస్తు పెట్టుకోగా కోర్టు గడువు మరోమారు పొడిగించిందని చెప్పారు.
గత నెల 28వ తేదీన రెండో టెస్టులో కూడ కరోనా వచ్చిందని హైకోర్టుకు ఖైదీ తరపు న్యాయవాది తెలిపారు. ఈ నెల 18వ తేదీలోపుగా లొంగిపోవాలని ఖైదీని ఆదేశించారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. కరోనా సోకిన ఖైదీ జైలుకు వస్తే ఇతర ఖైదీలకు, అధికారులకు వైరస్ సోకే ప్రమాదం ఉందని కూడ ఖైదీ తరపు న్యాయవాది చెప్పారు.