ఢిల్లీ-పుణె విస్తారా విమానానికి బాంబు బెదిరింపు: తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్

Published : Aug 18, 2023, 11:58 AM ISTUpdated : Aug 18, 2023, 12:21 PM IST
ఢిల్లీ-పుణె  విస్తారా విమానానికి బాంబు బెదిరింపు: తనిఖీలు  చేపట్టిన బాంబు స్క్వాడ్

సారాంశం

ఢిల్లీ-పుణె  వెళ్లే విస్తారా విమానానికి  బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. దీంతో  ఈ  విమానంలో  బాంబు స్క్వాడ్  తనిఖీలు చేపట్టారు.

 

న్యూఢిల్లీ: ఢిల్లీ-పుణె  వెళ్లే  విస్తారా విమానానికి శుక్రవారంనాడు  బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో  బాంబు స్క్వాడ్  తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ నుండి పుణె వెళ్లే విస్తారా విమానంలో  బాంబు ఉందని  ఢిల్లీ జీఎంఆర్ ఎయిర్ పోర్టుకు  ఇవాళ  ఉదయం  ఫోన్ వచ్చింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది విమానం నుండి ప్రయాణీకులను  కిందకు దించేశారు. విమానంలో  బాంబు కోసం తనిఖీలు చేపట్టారు. 

బాంబు బెదిరింపు ఫోన్ రావడంతో  ప్రయాణీకులను విమానం నుండి కిందకు  దింపేశారు.  ఇవాళ  ఉదయం 8:53 గంటలకు  బెదిరింపు ఫోన్ వచ్చినట్టుగా  ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు.   
ఢిల్లీ నుండి పుణె  వెళ్లాల్సిన యూకే-971  విమానంలో బాంబు ఉన్నట్టుగా  ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ వచ్చిన సమయంలో విమానంలో వంద మంది ప్రయాణీకులున్నారు.  ప్రయాణీకులను వెంటనే దించి  విమానంలో తనిఖీలు చేసినట్టుగా ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.  ఈ విమానానికి సెక్యూరిటీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చే వరకు  విమానం  ఎయిర్ పోర్టులోనే ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!