తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో బాంబు పేలుడు, ఇద్దరికి గాయాలు.. పశ్చిమ బెంగాల్ లో ఘటన

By team teluguFirst Published Nov 7, 2022, 6:10 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఘటన స్థలం నుంచి పోలీసులు మరో మూడు పేలని బాంబులు స్వాధీనం చేసుకున్నారు. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ఓ తృణమూల్ కాంగ్రెస్ పంచాయితీ సభ్యుడి నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఆదివారం బాంబు పేలింది. దీంతో అందులో పని చేస్తున్న ఇద్దరు మేస్త్రీలు గాయపడ్డారు. స్థానికుల సాయంతో పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలి నుంచి మరో మూడు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఆఫీసర్ దారుణ హత్య.. కారుతో గుద్ది పరారైన దుండగులు..

దేగంగాలోని బెడచంప నంబర్ టూ గ్రామపంచాయతీలోని నార్త్ చాంద్‌పూర్ ప్రాంతంలో రోడ్డుపక్కన షాహి సుల్తానా పంచాయతీ సభ్యురాలు ఓ ఇంటిని నిర్మిస్తోంది. అయితే అందులో ఆదివారం ఉదయం మేస్త్రీలు పని చేస్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా భారీ శబ్దంతో ఓ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం విన్న స్థానికులు నిర్మాణంలో ఉన్న ఇంటి ముందుకి చేరుకున్నారు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించి వారు పోలీసులకు సమాచారం అందించారు. 

అమానుషం.. జామపండు దొంగిలించాడనే అనుమానంతో దళితుడిపై దాడి, హత్య..

ఘటనా స్థలానికి చేరుకున్న దేగంగ పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. నిర్మాణంలో ఉన్న ఆ ఇంట్లో నాలుగు ముడి బాంబులు ఉంచారు. అయితే ఆదివారం మేస్త్రీ నిచ్చెన కింద పారతో శుభ్రం చేస్తున్నాడు. ఈ సమయంలో బాంబుకు పార తగలడంతో బాంబు పేలింది. కాగా.. బాంబులు ఇంట్లో ఎవరు, ఎందుకు పెట్టారో తమకు తెలియదని ఇల్లు కట్టిస్తున్న పంచాయతీ సభ్యురాలు భర్త అబ్దుల్ హకీం మొల్లా తెలిపారు. తమ పరువు తీసే కుట్రలో భాగంగానే ఇది జరిగిందని ఆయన ఆరోపించారు. సజీవ బాంబులను నిర్వీర్యం చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే నేను స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారమిచ్చానని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు తమని ఇరికించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. 

దారుణం.. కుమారుడికి గుండె జబ్బు నయమవుతుందని.. కూతురు గొంతు నులిమి హత్య చేసిన తల్లి.. ఎక్కడంటే ?

ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ మాట్లాడుతూ.. బెంగాల్ ఇంతకుముందు బాంబుల రికవరీని చూడలేదా అని అన్నారు. సీపీఎం, కాంగ్రెస్ హయాంలో బాంబులు లభ్యం కాలేదా అని, అలాంటి బాంబులకు భయపడాల్సిన పని లేదని తెలిపారు. రాయ్ వ్యాఖ్యలపై సీపీఎం నాయకుడు సుజన్ చక్రవర్తి మాట్లాడారు. “ సౌగతా రాయ్ బాంబు తయారీలో నిపుణుడిగా కనిపిస్తున్నారు. డబ్బు తీసుకోవడంలో నిష్ణాతుడని అందరికీ తెలుసు. కానీ అతను బాంబు తయారీ ఫార్ములాలో కూడా నిపుణుడని అందరికీ తెలియదు. ’’ అని ఎద్దేవా చేశారు. 

click me!