డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అరెస్టు

By telugu teamFirst Published Sep 8, 2020, 3:43 PM IST
Highlights

డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఎన్సీబీ అరెస్టు చేసింది. నాలుగు రోజుల పాటు విచారించిన ఎన్సీబీ చివరకు మంగళవారం రియాను అరెస్టు చేసింది.

ముంబై: బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నేషనల్ క్రైమ్ బ్యూర్ (ఎన్ సీబీ) అరెస్టు చేసింది. నాలుగు రోజుల విచారణ తర్వాత ఆమెను మంగళవారం అరెస్టు చేశారు. డ్రగ్స్ కు సంబంధించి ఆమె ఎన్సీబీ విచారణలో 25 మంది సినీ ప్రముఖల పేర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే రియా సోదరుడు సోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం ఎన్సీబీ రియాను తమ కస్టడీకి కోరే అవకాశం ఉంది. రియా సూచనలతోనే తాను సుశాంత్ రాజ్ పుత్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు సోవిక్ ఎన్సీబీ విచారణలో తెలిపాడు. 

కాగా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి తాను గంజాయి దట్టించిన సిగరెట్లు తాగేదాన్నని రియా చక్రవర్తి నేషనల్ క్రైమ్ బ్యూరో (ఎన్ సీబీ) ముందు అంగీకరించింది. విచారణ సందర్భంగా ఆమె ఆ విషయాన్ని వెల్లడించింది. 

సుశాంత్ సింగ్ 2016 నంచి డ్రగ్స్ తీసుకుంటున్నాడని విచారణలో ఆమె చెప్పింది. రియా ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఆ విషయాన్ని రాబట్టారు. రియా పాత మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్ ల ఫోరెన్సిక్ పరీక్షల్లో ఎన్ సీబీ పలు విషయాలు తెలిశాయి. 

రియా 2017, 2018, 2019ల్లో డ్రగ్స్ సర్కిల్ లో చాలా చురుగ్గా ఉన్నట్లు ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న గాడ్జెట్స్ ద్వారా వెల్లడైంది. ఆ గాడ్జెట్స్ నుంచి దర్యాప్తు సంస్థలు మత్తుపదార్థాలకు సంబంధించిన పలు ఫొటోగ్రాప్ లను, వీడియోలను, వాట్సప్ సందేశాలను, ఎస్ఎంస్ లను రాబట్టారు. వీడియోల్లో, ఫొటోల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వారి గురించి ఎన్ సీబీ ఆరా తీస్తోంది. వారిని ఎన్ సీబీ అధికారులు విచారిస్తారా లేదా అనేది తెలియదు. 

కాగా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో డ్రగ్స్ కు సంబంధించి పలు అరెస్టులు జరుగుతాయని భావిస్తున్నారు. సుశాంత్ పని మనిషి నీరజ్ కు సంబంధించి రియా, సౌవిక్, శామ్యూల్ కొన్ని విషయాలు వెల్లడించారు. దాంతో నీరజ్ ను ప్రశ్నించాలని ఎన్ సీబీ అధికారులు భావిస్తు్నారు. సీఎ శ్రుతి మోడీకి కూడా సమన్లు జారీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 

ఎన్ సీబీ అడిగిన పలు ప్రశ్నలకు సోమవారంనాటి విచారణలో సరైన సమాధానాలు ఇవ్వలేదు. డ్రగ్స్ ఇంటికే వచ్చేవా, డ్రగ్స్ కొనుగోలుకు ఎవరి డబ్బులు వాడేవారు, ముంబైలోని హోటల్లో సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడా వంటి ప్రశ్నలకు ఆమె జవాబులు ఇవ్వలేదు. 

click me!