అస్సాంలో నీటమునిగిన బోటు: 45మంది గల్లంతు

By rajesh yFirst Published 5, Sep 2018, 4:14 PM IST
Highlights

అస్సాం రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. 45 మంది ప్రయాణికులతో బ్రహ్మపుత్ర నదిని దాటుతున్నబోటు ఒక్కసారిగా నీట మునిగింది . ఈ ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. నార్త్ గౌహతి నుంచి గౌహతికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెప్తున్నారు.  

అస్సాం: అస్సాం రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. 45 మంది ప్రయాణికులతో బ్రహ్మపుత్ర నదిని దాటుతున్నబోటు ఒక్కసారిగా నీట మునిగింది . ఈ ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. నార్త్ గౌహతి నుంచి గౌహతికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెప్తున్నారు.  

ప్రమాదం సంభవించిన సమయంలో కొంతమంది తమ ప్రాణాలను దక్కించుకునేందుకు కొందరు ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నం చేశారని స్థానికులు చెప్తున్నారు. బోటులో మహిళలతోపాటు చిన్నారులు కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. 

ప్రమాద విషయం తెలుసుకున్న రాష్ట్రప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అస్సాం  రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మరియు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 


 

Last Updated 9, Sep 2018, 12:03 PM IST