వినాయక నిమజ్జనంలో అపశ్రుతి..11మంది మృతి

Published : Sep 13, 2019, 09:55 AM IST
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి..11మంది మృతి

సారాంశం

ప్ర‌మాద స‌మ‌యంలో బోటులో 18 మంది ఉన్నారు. మ‌ర‌ణించిన‌వారిని పిప్లానీ నివాసితులుగా గుర్తించారు. చ‌నిపోయిన‌వారి కుటుంబాల‌కు 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర మంత్రి పీసీ శ‌ర్మ తెలిపారు. ప్ర‌మాదానికి కార‌ణాన్ని అన్వేషిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్తుండగా నదిలో పడవ బోల్తాపడి 11 మంది మృతిచెందారు. మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతైయ్యారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది.

ఖట్లాపూరా ఘాట్ వద్ద ఉదయం పడవ బోల్తాపడింది. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్ర‌మాద స‌మ‌యంలో బోటులో 18 మంది ఉన్నారు. మ‌ర‌ణించిన‌వారిని పిప్లానీ నివాసితులుగా గుర్తించారు. చ‌నిపోయిన‌వారి కుటుంబాల‌కు 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర మంత్రి పీసీ శ‌ర్మ తెలిపారు. ప్ర‌మాదానికి కార‌ణాన్ని అన్వేషిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు