ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం.. పడవలో 55 మంది

sivanagaprasad kodati |  
Published : Jan 03, 2019, 08:24 AM IST
ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం.. పడవలో 55 మంది

సారాంశం

ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హక్కీటోలా నుంచి ప్రయాణికులతో తిరిగి వస్తోన్న ఓ నాటు పడవ బుధవారం రాత్రి కేంద్రపార జిల్లా నిప్పానియా వద్ద బోల్తాపడింది. 

ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హక్కీటోలా నుంచి ప్రయాణికులతో తిరిగి వస్తోన్న ఓ నాటు పడవ బుధవారం రాత్రి కేంద్రపార జిల్లా నిప్పానియా వద్ద బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో పడవలో ఉన్న వారంతా నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 9 మంది మృతదేహాలను వెలికితీశారు.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా జగత్‌సింగ్ పూర్ జిల్లా కుజంగా వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో పడవలో 55 మంది ప్రయాణికులున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
 
PREV
click me!

Recommended Stories

ఇరాన్ పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులు.. ఇండియాలో హైఅలర్ట్
Ayatollah Ali Khamenei: ఖమేనీ ఖతంకన్నీళ్లు పెట్టుకున్న ముస్లిం మహిళలు| Asianet News Telugu