కావేరీ ఇష్యూ: 26 మంది అన్నాడీఎంకె ఎంపీల సస్పెన్షన్

By narsimha lodeFirst Published Jan 2, 2019, 7:01 PM IST
Highlights

కావేరి అంశంపై లోక్‌సభలో  సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం కల్గించిన 26 మంది అన్నాడీఎంకె ఎంపీలను ఐదు పనిదినాల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు బుధవారం నాడు ప్రకటించింది.


న్యూఢిల్లీ: కావేరి అంశంపై లోక్‌సభలో  సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం కల్గించిన 26 మంది అన్నాడీఎంకె ఎంపీలను ఐదు పనిదినాల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు బుధవారం నాడు ప్రకటించింది.

కావేరీ నదిపై కర్ణాటకలో  ఆనకట్టను నిర్మించాలనే ప్రతిపాదనపై అన్నాడీఎంకే ఎంపీలు లోక్‌సభలో బుధవారం నాడు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.  సభ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలగడంతో  ఐదు రోజుల పాటు అన్నాడీఎంకె ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

కావేరీ నదిపై మేకదాటు  ఆనకట్ట నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడంపై అన్నాడీఎంకె మండిపడింది. ఎక్కువ సీట్లను గెలవాలనే ఉద్దేశ్యంతో బీజేపీ ఈ ఆనకట్ట నిర్మాణానికి అనుమతులను ఇచ్చిందని అన్నాడీఎంకె ఆరోపించింది.

ఈ విషయమై లోక్‌సభలో నిరసన తెలిపిన అన్నాడీఎంకెకు చెందిన  26 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్  బుధవారం నాడు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

రాఫెల్‌ డీల్‌పై లోక్‌సభలో గందరగోళం: రాహుల్‌కు జైట్లీ కౌంటర్


 

click me!