
16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలను వెలువరించేందుకు ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభించారు. అయితే ఈ కౌంటింగ్ లో బీజేపీ జోరు స్పష్టంగా కనిపించింది. కర్ణాటకలో 3 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ ఒకే స్థానానికి పరిమితం అయ్యింది. రాజస్థాన్ లో బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి సుభాష్ చంద్ర విసిరిన సవాలును అధిగమించి అధికార కాంగ్రెస్ పార్టీ నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడింటిని గెలుచుకుంది. హర్యానాలో బీజేపీ అభ్యర్థితో పాటు ఆ పార్టీ మద్దతు తెలిపిన ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా విజయం సాధించారు.
ఫోన్ మాట్లాడొద్దని చెప్పినందుకు అత్తను చంపిన కోడలు.. ఎక్కడంటే ?
ఈ విడతలో మొత్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావించింది. ఈ మేరకు గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందులో 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మిగిలిన 16 స్థానాలకు పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. ఇందులో హర్యానా (2), రాజస్థాన్ (4), మహారాష్ట్ర (6), కర్ణాటక (4) నాలుగు రాష్ట్రాల్లోని ఎగువ సభలోని స్థానాలు ఉన్నాయి.
కర్ణాటక
కర్ణాటకలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా.. బీజేపీ మూడు చోట్ల నుంచి పోటీ చేసింది. ఆ మూడు స్థానాలను కూడా గెలుచుకుంది. కాంగ్రెస్ కూడా ముగ్గురు అభ్యర్థులను పోటీలో ఉంచగా.. అందులో ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. లౌకికవాదం పేరుతో మద్దతు కోసం కాంగ్రెస్ చేసిన అభ్యర్థనను కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో జనతాదళ్ (సెక్యులర్) ఏ సీటును కూడా గెలుచుకోలేకపోయింది. తగినంత ఓట్లు లేనప్పటికీ ఆ పార్టీ ఒక అభ్యర్థిని నిలబెట్టింది. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (బీజేపీ), నటుడు-రాజకీయ నాయకుడు జగ్గేష్ (బీజేపీ), ఎమ్మెల్సీ లెహర్ సింగ్ సిరోయా (బీజేపీ), కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ (కాంగ్రెస్) విజయం సాధించారు.
రాజస్థాన్
రాజస్థాన్‌లోని అధికార పార్టీ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడింటిని గెలుచుకుంది. ఒక్క సీటును బీజేపీ కైవసం చేసుకుంది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గెలుపొందిన అభ్యర్థుల పేర్లను ట్విట్టర్ లో ప్రకటించారు. ఇందులో రణదీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ అలాగే బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఘనశ్యామ్ తివారీ ఉన్నారు.
హర్యానా
హర్యానా లో బీజేపీ అభ్యర్థి కిషన్ లాల్ పన్ వార్, ఇండిపెండెంట్ అభ్యర్థి కార్తికేయ శర్మలు గెలుపొందారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఫలితాలు చాలా ఆలస్యంగా వెలువడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లను చెల్లుబాటు కానిదిగా పరిగణించాలని డిమాండ్ చేయడంతో కౌంటింగ్ ఆలస్యమైంది. ఇదిలా ఉండగా ఈ ఓట్లు చెల్లుబాటు కాలేదని ఢిల్లీలోని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
gang rape : దారుణం.. 12 ఏళ్ల బాలికను తుపాకీతో బెదిరించి గ్యాంగ్ రేప్.. చర్యలు తీసుకోని పోలీసులు
కాంగ్రెస్ శాసన సభ్యులు కిరణ్ చౌదరి, బిబి బాత్రా తమ బ్యాలెట్ పత్రాలకు గుర్తు పెట్టిన తర్వాత ఇతర
అనధికార వ్యక్తులకు చూపించారని, అది కెమెరాలో రికార్డయిందని ఇండిపెండెంట్ అభ్యర్థి కార్తికేయ శర్మ, బీజేపీ అభ్యర్థి క్రిషన్ లాల్ పన్వార్ ECకి లేఖ పంపారు. ఇదే సమయంలో హర్యానాలో స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలను అడ్డుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. వెంటనే ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేసింది. అయితే హర్యానాలో 90 మంది ఎమ్మెల్యేలలో 89 మంది ఓటు వేయగా, స్వతంత్ర ఎమ్మెల్యే బాల్‌రాజ్ కుందు ఓటింగ్ కు గైర్హాజరయ్యారు.
మహారాష్ట్ర
మహారాష్ట్రలో జితేంద్ర అవాద్ (ఎన్సీపీ), యశోమతి ఠాకూర్ (కాంగ్రెస్), సుహాస్ కాండే (శివసేన) వేసిన బ్యాలెట్లపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆరు రాజ్యసభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది.
నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ ముంగంటివార్, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాల ఓట్లను చెల్లకుండా చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత నానా పటోలే ఈసీఐకి లేఖ రాశారు. మొత్తంగా ఇక్కడ ఆరు రాజ్యసభ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.