బీజేపీ బుల్డోజర్లతో జమ్మూ కాశ్మీర్‌ను ఆఫ్ఘనిస్థాన్‌గా మార్చింది: కాషాయ పార్టీపై మెహబూబా ముఫ్తీ ఫైర్

By Mahesh RajamoniFirst Published Feb 7, 2023, 1:02 PM IST
Highlights

Srinagar: బీజేపీ తమ బుల్డోజర్లతో జమ్మూ కాశ్మీర్‌ను ఆఫ్ఘనిస్థాన్‌గా మార్చిందని జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి మెహబూబా ముఫ్తీ విమ‌ర్శించారు. బుల్డోజర్లను ఉపయోగించి ప్రజల ఇళ్లను కూల్చివేసి ఈ ప్రాంతాన్ని బీజేపీ ఆఫ్ఘనిస్థాన్‌గా మార్చిందన్నారు. "మా ఉద్యోగాలు, భూములు, ఖనిజాలను బీజేపీ ఔట్ సోర్సింగ్ చేసింది. దేశంలో జర్నలిస్టులు, రాజకీయ నాయకులపై ఈడీ, ఎన్ఐఏలను ప్రయోగిస్తున్నారని" కూడా ఆమె ఆరోపించారు. 

Former Jammu Kashmir CM Mehbooba Mufti: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నాయకురాలు, జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మ‌రోసారి కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌మ్మూకాశ్మీర్ ను బీజేపీ  ఆఫ్ఘనిస్థాన్‌గా  మార్చింద‌ని ఆరోపించారు. బుల్‌డోజర్‌లను ఉపయోగించి ప్రజల ఇళ్లను కూల్చివేసి ఈ ప్రాంతాన్ని బీజేపీ ఆఫ్ఘనిస్థాన్‌గా మార్చిందంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

పీడీపీ అధ్యక్షురాలైన మెహబూబా ముఫ్తీ మంగ‌ళ‌వారం నాడు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ దేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. "జ‌మ్మూకాశ్మీర్ ను ఆఫ్ఘనిస్థాన్ గా మార్చారు. మెజారిటీని బీజేపీ అస్త్రంగా మార్చుకుందని" విమ‌ర్శించారు. ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ కింద పేదల ఇళ్లను కూల్చివేయడానికి బుల్డోజర్లను ఉపయోగించడం ద్వారా బీజేపీ జ‌మ్మూకాశ్మీర్ ను ఆఫ్ఘనిస్తాన్ గా మార్చిందని అన్నారు. బుల్డోజర్ల కారణంగా నేడు కాశ్మీర్ మీకు ఆఫ్ఘనిస్తాన్ లా కనిపిస్తుంద‌ని వ్యాఖ్యానించారు.

అలాగే, బీజేపీ పాలనలో జ‌మ్మూకాశ్మీర్ లో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ముఫ్తీ ఆరోపించారు. ఉచిత రేషన్ కోసం ప్రజలు రోడ్డుపై పడుకోని ఏకైక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ మాత్రమేనని ఆమె అన్నారు. బీజేపీ వచ్చినప్పటి నుంచి దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న ప్రజలు కూడా దిగువకు వచ్చారు. జమ్ముకశ్మీర్ ను పాలస్తీనా, ఆఫ్ఘనిస్థాన్ లా తీర్చిదిద్దాలని వారు కోరుకుంటున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. జ‌మ్మూకాశ్మీర్ ను బుల్డోజ‌ర్ల‌తో పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్ లా మాదిరి చేశార‌ని అన్నారు.

పాలస్తీనా ఇంకా మెరుగ్గా ఉంది.. కనీసం జనాలు మాట్లాడగలిగే పరిస్థితులు ఉన్నాయి. ప్రజల ఇళ్లను కూల్చివేసేందుకు బుల్డోజర్లను వినియోగిస్తున్న తీరు వల్ల జమ్మూకాశ్మీర్ ఆఫ్ఘనిస్థాన్ కంటే అధ్వాన్నంగా తయారవుతోంది. ప్రజల చిన్న చిన్న ఇళ్లను కూల్చివేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?.. : జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పై కూడా ముఫ్తీ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ సందర్భంగా పేదల ఇళ్లను తాకబోమని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పవచ్చు..  కానీ, టిన్ షెడ్లు ఉన్న నివాసాలను కూడా కూల్చివేస్తున్నందున ఆయన సందేశం క్షేత్రస్థాయిలో వినబడడం లేద‌ని విమ‌ర్శించారు. బీజేపీ తన క్రూర మెజారిటీని ఉపయోగించి అన్నింటిని అస్త్రంగా చేసుకుని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. 'ఏక్ సంవిధన్, ఏక్ విధాన్, ఏక్ ప్రధాన్' నినాదం రాజ్యాంగం లేని 'ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం' అనే నినాదానికి దారితీసిందని ముఫ్తీ ఆరోపించారు.

ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ, రాజ్యాంగం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరి గొంతు అణిచివేయబడుతుందని మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. 
"2019 నుండి జరిగిన ప్రతిదీ మా గుర్తింపు, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు-మా భూమిపై దాడి" అని పీడీపీ చీఫ్ అన్నారు. "మా ఉద్యోగాలు, భూములు, ఖనిజాలను బీజేపీ ఔట్ సోర్సింగ్ చేసింది. దేశంలో జర్నలిస్టులు, రాజకీయ నాయకులపై ఈడీ, ఎన్ఐఏలను ప్రయోగిస్తున్నారని" కూడా ఆమె ఆరోపించారు. 

click me!