అధికారం కోసం వాళ్లు మణిపూర్‌నే కాదు.. దేశం మొత్తాన్నీ తగులబెడతారు: బీజేపీ-ఆర్ఎస్ఎస్‌లపై రాహుల్ గాంధీ ఫైర్

Published : Jul 27, 2023, 04:35 PM IST
అధికారం కోసం వాళ్లు మణిపూర్‌నే కాదు.. దేశం మొత్తాన్నీ తగులబెడతారు: బీజేపీ-ఆర్ఎస్ఎస్‌లపై రాహుల్ గాంధీ ఫైర్

సారాంశం

అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని, ఎంతకైనా దిగజారుతుందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. వారు మణిపూర్‌ను తగుబెడతారని, దేశాన్నీ తగులబెడతారని అన్నారు. వారికి అధికారమే పరమావధి, ప్రజా సంక్షేమం పట్టదని ఆరోపణలు గుప్పించారు.  

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయానాడు మాజీ ఎంపీ రాహుల్ గాంధీ అధికార బీజేపీపై విమర్శలు సంధించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. వారికి కేవలం అధికార యావ తప్ప ప్రజాల బాగోగులు పట్టదని అన్నారు. అధికారం కోసం వారు ఎంతకైనా దిగజారుతారని పేర్కొన్నారు. అధికారం కోసం మణిపూర్‌ను తగులబెడతారని, అవసరమైతే దేశం మొత్తాన్నీ కాల్చేస్తారని అన్నారు.

యూత్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ వర్చువల్‌గా మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని కొంత భాగాన్ని కాంగ్రెస్ ట్విట్టర్‌లో పంచుకుంది. ఆ వీడియోలో ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై విమర్శలు సంధిస్తున్నారు. వారికి అధికారం తప్ప ప్రజల సంక్షేమం అవసరం లేదని అన్నారు. అధికారం కోసం వారు ఏమైనా చేస్తారని పేర్కొన్నారు. వారు మణిపూర్‌ను తగులబెడతారని అన్నారు. దేశం మొత్తాన్నీ నాశనం చేస్తారని ఆరోపణలు చేశారు. వారు ప్రజల బాధలు, దుఖం పట్టించుకోరని తెలిపారు. అది హర్యానా కానివ్వండి, పంజాబ్, ఉత్తరప్రదేశ్ కానివ్వండి నాశనం చేసేస్తారని అన్నారు. వారు అధికారం కోసం దేన్నైనా అమ్మేస్తారని చెప్పారు.

Also Read: No Confidence Motion: అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటీ? ప్రధాని కచ్చితంగా మాట్లాడాలా? నిబంధనలేం చెబుతున్నాయి?

‘దేశంలో ఎవరికి బాధ కలిగినా, వారు ఏ ప్రాంతంవారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా సరే వారికి బాధ కలిగితే మీరు కూడా బాధపడతారు. ఎందుకంటే మీరు దేశ భక్తులు. మీరు భారతీయులు’ అని రాహుల్ గాంధీ అన్నారు. 

‘నేను ఇటు వైపు కూర్చుంటే.. మీరు అటు వైపు కూర్చున్నారు. మనమంతా దేశం అంటే ఎనలేని ప్రేమ కలిగినవారం. ఈ  దేశం ఎక్కడ గాయపడినా మనమంతా బాధపడిపోతాం. మన మనసు ఉన్నట్టుండి ఎందుకు బాధపడుతుందో తెలియదు. మూడాఫ్ ఎందుకు అయిందో తెలియదు. దేశ పౌరుడి బాధను మనం అలా లోపలి నుంచి పంచుకుంటాం. కానీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లకు ఈ ప్రేమ ఉండదు. వారు బాధపడరు. ప్రజల బాధలను చూసి వారు కలత చెందరు. ఎందుకంటే వారు దేశాన్ని విభజించే పనిలోనే ఉన్నారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nayanthara : నయనతారను పెళ్లి చేసుకోవాలని ఉంది.. ఎంపీ కామెంట్స్‌తో రచ్చ రచ్చ
Egg Expiry Date : ఇక కోడిగుడ్లపై కూడా ఎక్స్‌పైరీ డేట్.. అసలివి ఎన్నిరోజులు నిల్వ ఉంటాయో తెలుసా?