కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికలు.. ‘‘ పీఎంవో సైకోలు’’ వద్దంటూ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 05, 2021, 07:01 PM IST
కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికలు.. ‘‘ పీఎంవో సైకోలు’’ వద్దంటూ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. విపక్ష పార్టీలపై దూకుడుగా వుండే ఈయన.. సొంత పార్టీ నేతలను కూడా వదలరు. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. విపక్ష పార్టీలపై దూకుడుగా వుండే ఈయన.. సొంత పార్టీ నేతలను కూడా వదలరు. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏకంగా ‘పీఎంవో సైకోలు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. 

దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్‌పై నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి గడ్కరీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రెండు రోజుల క్రితం సుబ్రమణ్యస్వామి సూచించారు.

Also Read:12 రాష్ట్రాల్లో లక్ష కేసులు... బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్‌లలో దారుణ పరిస్థితులు: లవ్ అగర్వాల్

బుధవారం ఇదే విషయాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. కోవిడ్ థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్నారులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని తాను రెండు రోజుల క్రితమే హెచ్చరించాని సుబ్రమణ్యస్వామి గుర్తుచేశారు.

ఈ రోజు నీతి అయోగ్ సభ్యుడు కూడా కోవిడ్ థర్డ్ వేవ్‌ను నిర్ధారించారని ఆయన వెల్లడించారు. కరోనాను అరికట్టడానికి సరైన వ్యూహరచన వేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పీఎంవో సైకోలు కాకుండా ప్రత్యేకమైన బృందం కావాలంటూ సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించాల్సి వుంది. 

 

 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?