డీజీపీ నీరజ్ నయాన్ ను బదిలీ చేస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ బుధవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు. సీఎంగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది.
కోల్‌కత్తా: డీజీపీ నీరజ్ నయాన్ ను బదిలీ చేస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ బుధవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు. సీఎంగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది. వీరేంద్రను తిరిగి బెంగాల్ డీజీపీగా మమత బెనర్జీ నియమించింది. జావీద్ షమీమ్ ను శాంతిభద్రతల అడిషనల్ డీజీగా నియమిస్తూ మమత సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఎన్నికల సమయంలో డీజీపీ వీరేంద్రను , అడిషనల్ డీజీ జావీద్ ను బదిలీ చేసింది ఈసీ.
also read:మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా: మమత బెనర్జీ ప్రమాణం
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో హింస చెలరేగాయి. తమ పార్టీ కార్యాలయంపై టీఎంసీ దాడులకు దిగిందని బీజేపీ ఆరోపించింది. ఈ విషయమై గవర్నర్ మంగళవారం నాడు రాష్ట్ర డీజీపీని పిలిచి మాట్లాడారు. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని కోరారు. కేంద్ర హోంశాఖ కూడ ఈ విషయమై నివేదిక కోరింది. మమత సీఎంగా ప్రమాణం చేసిన కొద్దిసేపటి తర్వాత ఆ రాష్ట్ర గవర్నర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పనిచేయాలన్నారు. కొత్త తరహలో పాలనను సాగించాలని ఆయన మమతకు ఆయన సూచించారు.