Parliament Attack : హీరో ఆఫ్ ది డే.. పార్లమెంట్‌లో అగంతకుడిని పట్టుకున్నది ఈయనే, ఎవరీ ఆర్కే సింగ్..?

By Siva Kodati  |  First Published Dec 13, 2023, 3:33 PM IST

భారత ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ పటేల్ హీరోగా నిలిచారు. 


భారత ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూసుకెళ్లగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలాడు. లోక్‌సభలోకి దూకిన వ్యక్తి .. ఎంపీలు కూర్చొనే టేబుళ్లపైకి ఎక్కి నల్ల చల్లాలను బంద్ చేయాలంటూ నినాదాలు చేశాడు.  చర్చా కార్యాక్రమంలో వున్న వేళ పొగ రావడంతో లోపల ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. అయితే కొందరు మాత్రం వారిని ధైర్యంగా పట్టుకున్నారు.  ఈ ఘటనకు సంబంధించి బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ పటేల్ హీరోగా నిలిచారు. 

పటేల్ న్యూస్ 18 వార్తాసంస్థతో మాట్లాడుతూ.. తాము బయటకు వెళ్తున్నప్పుడు .. నిందితుల్లో ఒకరు భద్రతా సిబ్బందితో గొడవ పడటం తాను చూశానని తెలిపారు. తాను అతని వైపుకు దూసుకెళ్లి మెడను పట్టుకున్నానని, వెంటనే ఇతర ఎంపీలు అక్కడికి వచ్చారని , అయితే అతను తన వద్ద వున్న స్మోక్ డబ్బాతో మమ్మల్ని కొట్టేందుకు ప్రయత్నించాడని పటేల్ వెల్లడించారు. 

Latest Videos

ఆర్కే సింగ్ ఎవరు:

ఆర్కే సింగ్ పటేల్ ఉత్తరప్రదేశ్‌లోని బండా నుంచి బీజేపీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  2009, 2019లలో ఆయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాణిక్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996, 2002 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కార్వీ నియోజకవర్గం నుంచి ఆర్కే సింగ్ పటేల్ ఎమ్మెల్యేగా గెలిచారు. 

కాగా.. నిందితులు లోపలికి చొరబడిన నేపథ్యంలో లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఈ ఘటనపై ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి వచ్చి పసుపు రంగు గ్యాస్‌ను తమపై స్ప్రే చేశారని తెలిపారు. తమలో కొందరు వారిని పట్టుకున్నారని, ఈ ఘటనతో కొత్త పార్లమెంట్ భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. 
 

click me!