Mukesh Ambani family security: అంబానీ కుటుంబ భద్రతపై సుప్రీం కోర్టు కీల‌క ఆదేశాలు.. 

Published : Jul 22, 2022, 07:01 PM IST
Mukesh Ambani family security: అంబానీ కుటుంబ భద్రతపై సుప్రీం కోర్టు కీల‌క ఆదేశాలు.. 

సారాంశం

Mukesh Ambani family security: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్​ అంబానీ కుటుంబానికి భద్రత విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను కొనసాగించడానికి కేంద్రానికి సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. 

Mukesh Ambani family security: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అత‌ని కుటుంబ సభ్యుల భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముంబైలో ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు ఇచ్చిన భద్రతను కేంద్రం అలాగే కొనసాగించాల‌ని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.   

అంబానీ కుటుంబ భ‌ద్ర‌త విష‌యంలో త్రిపుర హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ.. కేంద్రం చేసిన అప్పీల్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం స్వీక‌రించింది. ఈ మేర‌కు భ‌ద్ర‌త కొన‌సాగించాల‌ని ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు.. అంబానీ కుటుంబ ​భద్రత కల్పించడాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిల్‌పై త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జూన్​ 29న సుప్రీం కోర్టు స్టే విధించింది.

కేంద్రం వాదన ఇది

కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా... త్రిపుర (వికాస్‌ సాహా)లోని పిఐఎల్‌కు ముంబైలో ఏర్పాటు చేసిన ప్రజల భద్రతకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బికాష్ సాహా అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై త్రిపుర హైకోర్టు మే 31, జూన్ 21 తేదీల్లో రెండు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  అంబానీ, అతని భార్య మరియు పిల్లల ప్రాణాలకు ప్రమాదం ముంచి ఉంద‌ని అనే నివేదికల‌కు
సంబంధించి ఒరిజినల్​ పత్రాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.   

త్రిపుర హైకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏ కుటుంబానికైనా భద్రత కల్పించడం ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాదని, అంబానీ భద్రతకు త్రిపురకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టులో అప్పీల్‌లో పేర్కొంది.

అధికారిక నివేదిక‌ల ప్ర‌కారం.. అంబానీకి Z+ భద్రత ఉంది. ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించే అత్యున్నతమైన సెక్యూరిటీ కవర్. అతని భార్య నీతా అంబానీకి పెయిడ్ Y+ సెక్యూరిటీ ఉంది. Z+ భద్రత కింద  దేశంలోని అత్యంత ధనవంతుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుండి 50-55 మంది సాయుధ కమాండోలు అతనికి రక్షణగా ఉంటాడు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం