నా కారు మినిస్టర్ పేరు మీదికి మారింది.. వెంటనే నా పేరిట చేయండి: అసెంబ్లీలో ఎమ్మెల్యే వేడుకోలు

Published : Mar 25, 2022, 08:04 PM IST
నా కారు మినిస్టర్ పేరు మీదికి మారింది.. వెంటనే నా పేరిట చేయండి: అసెంబ్లీలో ఎమ్మెల్యే వేడుకోలు

సారాంశం

మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సావ్‌కారే అసెంబ్లీలో మాట్లాడుతూ.. తన కారు తనకు తెలియకుండానే రవాణా శాఖ మంత్రి పేరు మీదకు మారిపోయిందని అన్నారు. వెంటనే తన కారు డాక్యుమెంట్లు తన పేరిట చేయాలని కోరారు. దీనికి అసెంబ్లీలోనే ఉన్న మంత్రి స్పందించి సమాధానం ఇచ్చారు.

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు ఓ నాటకీయ పరిణామం ముందుకు వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు సభ్యులందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేశాయి. తన కారు.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేరు మీదికి బదిలీ అయిందని ఆరోపించారు. తనకు తెలియకుండానే తన కారు మంత్రి పేరు మీదికి మారిపోయిందని అన్నారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని అదే రవాణా శాఖ మంత్రినే కోరారు.

భూసావాల్ నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సావ్‌కారే శుక్రవారం అసెంబ్లీలో తన గోడు వినిపించారు. తనకు ఒక టయోటా ఇన్నోవా కారు ఉన్నదని వివరించారు. కానీ, ఇప్పుడు ఆ కారు తనకు తెలియకుండానే రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ పేరు మీదకు బదిలీ అయిందని తెలిపారు. అది ఎలా అయిందో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. దయచేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్‌ను కోరారు. దీనిపై రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ స్పందించారు.

బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సావ్‌కారేకు సమాధానంగా రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ మాట్లాడుతూ, ఇది చాలా తీవ్రమైన విషయం అని వివరించారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను ఆదేశించినట్టు వివరించారు. అలాగే, ఆ కారు డాక్యుమెంట్లను బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సావ్‌కారే పేరు మీదకు మార్చాలని పేర్కొన్నారు. ఈ తంతు మొత్తం కూడా వేగంగా జరుగుతుందని ఆ బీజేపీ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో ఇటీవలే ఓ అవగాహన కార్యక్రమం వివాదాస్పదమైంది. కుటుంబ నియంత్రణ విషయంలో దేశంలో.. ప్రభుత్వం అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం చాలా సర్వ సాధారణం. ఈ క్రమంలో... గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఆశావర్కర్ల సహాయంతో.. కుటుంబ నియంత్రణ కిట్స్ ని కూడా పంచిపెడుతూ ఉంటారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే పంచి పెట్టింది. అయితే... అలా పంచిపెట్టిన కిట్ లో.. రబ్బరు పురుషాంగం కూడా ఉండటం గమనార్హం. ఆశావర్కర్లతో సహా...  గ్రామస్థులు కూడా షాకయ్యారు.

రబ్బరు గర్భాశయం, పురుషాంగం కిట్‌ లో ఉంచడం పట్ల ఆశా కార్యకర్తలు విస్మయం చెందారు. ఇప్పటి వరకూ కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా కరపత్రాలు, చిత్రాలతో కూడిన బుక్‌లెట్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ, ప్రస్తుతం మొదటిసారి కిట్‌లో రబ్బరు పురుషాంగం, గర్భాశయం, కండోమ్‌లను ఉంచింది. వీటి సాయంతో కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారికి దీనిపై కౌన్సిలింగ్ ఇస్తారు. ఉత్తమ గర్భనిరోధక పద్దతుల్లో ఒకటైన కండోమ్ వాడకం గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో రబ్బరు పురుషాంగాన్ని ఉంచినట్టు తెలుస్తోంది.

అభ్యంతరకర వస్తువులను కిట్​ లో ఉంచడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్​ సందర్భంగా తాము వాటిని ఉపయోగించి కుటుంబ నియంత్రణ పద్ధతులను ఇలాంటి కిట్లు ఇవ్వడమేంటని భాజపా శాసన సభ్యురాలు చిత్రా వాగ్​ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో రాష్ట్ర మంత్రి రాజేంద్ర శింగా విచారణకు ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu