యూపీ మినిస్టర్‌కు విచిత్ర సమస్య! పేరులో కాంగ్రెస్.. చేరిన పార్టీ బీజేపీ

Published : Mar 25, 2022, 07:30 PM ISTUpdated : Mar 25, 2022, 07:35 PM IST
యూపీ మినిస్టర్‌కు విచిత్ర సమస్య! పేరులో కాంగ్రెస్.. చేరిన పార్టీ బీజేపీ

సారాంశం

ఉత్తరప్రదేశ్ మంత్రికి ఓ విచిత్ర సమస్య ఎదురైంది. తల్లితండ్రి పెట్టిన పేరు కాంగ్రెస్ సింగ్. ఆయన చేరిన పార్టీ మాత్రం బీజేపీ. ఇప్పుడు మంత్రి కూడా. అందుకే ఆయన బీజేపీలో చేరిన వెంటనే తన పేరును మార్చుకున్నారు. కాంగ్రెస్ సింగ్ పేరుకు బదులు స్వతంత్ర దేవ్ సింగ్ అని పెట్టుకున్నారు. ఆయనే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా.

లక్నో: ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 52 మంది మంత్రులుగా ప్రమాణం తీసుకున్నారు. ఇందులో స్వతంత్ర దేవ్ సింగ్ కూడా ఉన్నారు. స్వతంత్ర దేవ్ సింగ్ బలమైన ఓబీసీ నేత. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓ విచిత్ర సమస్య ఎదురైంది. సమస్య ఎదుటి వారి నుంచి తన నుంచి తనకే సమస్య ఎదురైంది. తల్లి తండ్రులు ఆయనకు కాంగ్రెస్ సింగ్ అని పేరు పెట్టారు. కానీ, ఆయనకు బీజేపీ రాజకీయాలపై అమిత ఆసక్తి. అందుకే ఆయన తన పేరు మార్చుకోలేక తప్పలేదు. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత తన పేరు మార్చుకున్నారు. కాంగ్రెస్ సింగ్‌కు బదులు స్వతంత్ర దేవ్ సింగ్ అని పెట్టుకున్నారు.

1964 ఫిబ్రవరి 13వ తేదీన మీర్జాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో స్వతంత్ర దేవ్ సింగ్ జన్మించారు. ఆయన బీసీకి చెందిన కుర్మీ కులస్తుడు. ఆయన తన కెరీర్‌ను 1986లో ఒక ఇంగ్లీష్ పత్రికకు విలేకరిగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల వైపు టర్న్ తీసుకున్నారు.

బీజేపీ చేరిన తర్వాత తన పేరును మార్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన బీజేపీలోని చాలా విభాగాలలో పని చేశారు. ఆ శాఖలకు బాధ్యుడిగానూ ఎదిగారు. బీజేపీ యువజన శాఖ బీజేవైఎంకు రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగాను, జనరల్ సెక్రెటరీగానూ చేశారు. ఇప్పటికీ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ అధికారంలోకి రావడానికి స్వతంత్ర దేవ్ సింగ్ ఎంతో కృషి చేశారు. 2014, 2017లలో ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ నిర్వహించిన ర్యాలీలు, సభల విజయం వెనుక స్వతంత్ర దేవ్ కృషి ఉన్నది. యోగి ఆదిత్యానాథ్ గత ప్రభుత్వ హయాంలోనూ స్వతంత్ర దేవ్ సింగ్ మంత్రి గా ఉన్నారు. ఈ సారి కూడా మంత్రిగా ప్రమాణం చేశారు.

కాగా, పంజాబ్(Punjab) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) జాతీయ పార్టీలు సహా అన్నింటినీ ఆప్(AAP) ఊడ్చేసింది. చరిత్ర సృష్టిస్తూ తొలిసారి పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాల్లో 92 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఆప్ తరఫున గెలిచిన అభ్యర్థుల్లో నరీందర్ కౌర్ భరాజ్ కూడా ఉన్నారు. పంజాబ్‌లోని సంగ్రూర్ నియోజకవర్గం నుంచి నరీందర్ కౌర్ భరాజ్ గెలుపొందారు. ఈ స్థానం నుంచి శిరోమణి అకాలీ దళ్ తరఫున బరిలోకి దిగిన క్యాండిడేట్ మాత్రం ఓటమి చవిచూశాడు. ఓడిపోయి నాలుగో స్థానంలో నిలిచినా.. ఆయన విన్నర్‌గానే ఉన్నారు. ట్విట్టర్‌లో నెటిజన్లు ఆయన పేరును పేర్కొంటూ విన్నర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

సంగ్రూర్ నుంచి పోటీ చేసిన శిరోమణి అకాలీ దళ్ అభ్యర్థి పేరు విన్నర్‌జీత్ సింగ్ గోల్డీ(Winnerjit Singh Goldy). ఆయన పేరులో విన్నర్, జీత్‌లు ఉన్నాయి. ఆయన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పేరులో విన్నర్ ఉన్నది కదా.. అందుకే నెటిజన్లు ఆయన ఓడినా.. విన్నరే అని ఛమత్కారాలు చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఆయన పేరులోని ఇంగ్లీష్ పదం విన్నర్ అన్నా.. హిందీలో జీత్ అన్నా.. గెలుపే. దీంతో ఆయన ఓడినా.. విన్నరే అని ట్వీట్లు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !