'చట్టానికి ఎవరు చుట్టం కాదు': ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్యే రఘునందన్  విమర్శలు

Published : Mar 09, 2023, 12:14 AM IST
'చట్టానికి ఎవరు చుట్టం కాదు':  ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్యే రఘునందన్  విమర్శలు

సారాంశం

ఎమ్మెల్సీ కవితపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కపోయిన  కవిత.. తెలంగాణ ఆడపడుచులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.   

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కపోయిన చెల్లెమ్మ కవిత.. తెలంగాణ ఆడపడుచులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనీ, అలా చేసి మరో తప్పు చేయోద్దని సూచించారు. దుబ్బాక పట్టణంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ బూత్ స్వశక్తి కరణ్ అభియాన్, భారత రాష్ట్రపతి ప్రసంగం వర్క్ షాప్‌లో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు అవినీతి చేస్తే .. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న వారికి  చెల్లెమ్మ కవితకిచ్చిన ఈడీ నోటీసులే సమాధానం చెబుతాయని అన్నారు.లిక్కర్ స్కామ్ లో ఎందుకు తలదూర్చారో గుర్తు చేసుకోవాలని అన్నారు. 

ఢిల్లీ లిక్కర్ దందా కేసులో ఎమ్మెల్సీ కవితను ముద్దాయని తెలుపుతూ ఈడీ నోటీసులు ఇచ్చింది. మోడి కాదని ఆయన అన్నారు. నోటీసులు ఇస్తే..  నేను ఎదుర్కొంటా అని గతంలో ప్రస్తవించారని అన్నారు.  గతంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా నీలాగా తప్పించుకోవాలని ప్రయత్నించారు. కానీ తప్పలేదని, చట్టానికి ఎవరు చుట్టం కాదని, ఆ విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలని అన్నారు. చట్టం తన పని తాను చేసుకపోతుందనీ, నిన్నటి దాకా కవితమ్మ అన్నారనీ, ఆ మాట నిజమైతే.. విచారణను ఎదుర్కొవాలని సవాల్ విసిరారు. 

ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఢిల్లీలో ధర్నా చేస్తున్నందుకే నోటీసుల ఇచ్చారని సింపతి కోసం జిమ్మిక్కులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత తప్పులని అందరూ అర్థం చేసుకున్నారనీ,  కాబట్టి ఆమెపై ఎవ్వరికి  సానుభూతి లేదన్నారు. కవితకు ఇచ్చిన నోటీసులకు తెలంగాణ (Telangana) పౌర సమాజానికి సంబంధం లేదని,  అలాగే ఇది బీఆర్ఎస్ (BRS) పార్టీకి సంబంధం లేనటు వంటి అంశమని స్పష్టం చేశారు.  
 

PREV
click me!

Recommended Stories

Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu
అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?