ఛత్తీస్ గఢ్ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు మీద అత్యాచారం కేసు..

Published : Jan 20, 2023, 10:44 AM IST
ఛత్తీస్ గఢ్ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు మీద అత్యాచారం కేసు..

సారాంశం

ఛత్తీస్ గఢ్ లోని ఓ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు మీద అత్యాచారం కేసు నమోదయ్యింది. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడడని అతని మీద ఆరోపణలు వచ్చాయి. 

రాయ్‌పూర్ : రాయ్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ విధానసభలో ప్రతిపక్ష నాయకుడి కుమారుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అతని మీద జాంజ్‌గిర్-చంపా జిల్లాకు చెందిన ఒక మహిళ అత్యాచారం ఆరోపణలతో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ మేరకు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, జంజ్‌గిర్ చంపా ఎమ్మెల్యే నారాయణ్ చందేల్ కుమారుడు పలాష్ చందేల్.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు.

ఈ మేరకు అత్యాచారం ఆరోపణలతో నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ (నివారణ) చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. సదరు బాధిత మహిళ టీచర్‌గా పనిచేస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి, అత్యాచారం చేశాడని.. ఆ తరువాత తాను గర్భం దాల్చడంతో.. చందేల్ తన బిడ్డను బలవంతంగా అబార్షన్ చేయించారని ఆరోపించారు.

దేశ ప్ర‌యోజ‌నాల కోస‌మే ప్ర‌తిప‌క్షాలను ఏకం చేస్తాం.. కేసీఆర్ ఖమ్మం స‌భ‌పై నితీష్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు

ఈ సమస్యను లేవనెత్తుతూ ఆమె ఇంతకుముందు రాయ్‌పూర్‌లోని ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు వ్రాతపూర్వక ఫిర్యాదును సమర్పించింది. గత కొన్ని నెలలుగా ఈ విషయంపై విచారణ జరుగుతోంది. కమిషన్ గురువారం కేసును పోలీసులకు అప్పగించింది. రాయ్‌పూర్‌లోని మహిళా ఠాణాలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.
కేసు ఫైల్‌ను విచారణ, తదుపరి చర్యల కోసం జాంజ్‌గిర్ పోలీసులకు పంపారు.ఓబీసీకి చెందిన నారాయణ్ చందేల్ ఇటీవల ఎల్ఓపీగా నియమితులయ్యారు.

చందేల్ జాంజ్‌గిర్ నియోజకవర్గం నుండి క్రమం తప్పకుండా విజయం సాధిస్తూ వస్తున్నాడు. దీంతో అతనికి ఈ ప్రాంతంలో రాజకీయ పలుకుబడిని ఎక్కువగానే ఉంది. భానుప్రతాపూర్ (ఎస్టీ) నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా, బీజేపీ అభ్యర్థి బ్రహ్మానంద్ నేతమ్‌పై అత్యాచారం కేసు నమోదైంది. పొరుగున ఉన్న జార్ఖండ్‌కు చెందిన పోలీసులు బీజేపీ నాయకుడిని అదుపులోకి తీసుకునే ప్రచారంలో నియోజకవర్గంలో క్యాంప్ చేశారు. అయితే, జార్ఖండ్ హైకోర్టు స్టే ఆర్డర్‌తో అతనిని టీమ్ అరెస్టు చేయలేదు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu