‘సర్కార్’ సినిమాపై బీజేపీ వ్యతిరేకత

By ramya neerukondaFirst Published Nov 6, 2018, 1:19 PM IST
Highlights


తమిళనటుడు విజయ్ నటించిన తాజా చిత్రం ‘ సర్కార్’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై బీజేపీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 


తమిళనటుడు విజయ్ నటించిన తాజా చిత్రం ‘ సర్కార్’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై బీజేపీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అర్థంపర్థం లేని కథలతో నకిలీ ఓట్లపై సినిమా తీశారంటూ తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్ రాజన్ వ్యాఖ్యానించారు. 

దీపావళి పండగను పురస్కరించుకొని చెన్నైలోని పేదలకు ఆమె వస్త్రదానం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... తప్పుడు కథనాలతో రాజకీయ వ్యవస్థను కించపరుస్తూ చిత్రాలు తీయడం మంచిదికాదన్నారు. అందుకే విజయ్ సర్కార్ ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.  అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే విషయం పై కూడా ఆమె స్పందించారు.

తమిళనాడులో కొందరు సినిమా తారలు రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయిపోదామని కలలు కంటున్నారని విమర్శించారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితి బాగానే ఉందని.. ఏ సినిమా తారలు వచ్చి బాగు చేయాల్సిన అవసరం లేదన్నారు. 

కాంగ్రెస్, టీడీపీ మరికొన్ని ఇతర పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న కూటమి దేశ శ్రేయస్సు కోసం కాదన్నారు. తమతమ వారసులకు పట్టం కట్టేందుకే అని విమర్శించారు. 
 

click me!