ఉత్తరాఖండ్ లో షూటౌట్‌.. బీజేపీ నాయకుడి భార్య మృతి.. యూపీ పోలీసులపై హత్య కేసు..

By Rajesh KarampooriFirst Published Oct 13, 2022, 11:05 AM IST
Highlights

ఉత్త‌రాఖండ్ లో  దారుణం జ‌రిగింది. పోలీసులకు, మైనింగ్ మాఫియా మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన స్థానిక బీజేపీ నాయకుడి భార్య మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు నలుగురు పోలీసులను బందీలుగా పట్టుకున్నారు. ఉత్తరాఖండ్‌లో యూపీ పోలీసులపై హత్య కేసు కూడా నమోదైంది.

పోలీసులకు, మైనింగ్ మాఫియా మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన స్థానిక బీజేపీ నాయకుడి భార్య మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ఉత్తరాఖండ్‌లోని జస్పూర్ లో చేసుకుంది. మృతురాలిని  బీజేపీ నాయ‌కుడు గుర్తాజ్ భుల్లర్ భార్య గురుప్రీత్ కౌర్‌గా గుర్తించారు. 

వివరాల్లోకెళ్తే..  జఫర్ అనే మైనింగ్ మాఫియా అనుచ‌రుడి అరెస్టు చేసేందుకు మొరాదాబాద్ పోలీసు బృందం ఉత్తరాఖండ్‌లోని జస్పూర్‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలో ఇరువ‌ర్గాల  మ‌ధ్య‌ జరిగిన ఘర్షణలో ఇద్దరు పోలీసు అధికారులు కాల్పులు జరపగా, ముగ్గురు గాయపడ్డారు. అదే స‌మ‌యంలో బీజేపీ నాయకుడి భార్య మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు నలుగురు పోలీసులను బందీలుగా పట్టుకున్నారు. ఉత్తరాఖండ్‌లో యూపీ పోలీసులపై హత్య కేసు కూడా నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాఫర్  అనే మైనింగ్ మాఫియా అనుచ‌రుడిపై ప్ర‌భుత్వం రూ. 50,000 రివార్డ్  ప్ర‌క‌టించింది. ఆ వాంటెడ్ క్రిమినల్ భుల్లర్ ఇంట్లో దాక్కున్నాడ‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. పోలీసుల బృందం  అక్కడికి  (భరత్‌పూర్ గ్రామం) చేరుకున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ఆ క్రిమిన‌ల్ అక్క‌డి నుంచి తప్పించుకున్నాడు. ఇదే స‌మ‌యంతో  పోలీసు బృందాన్ని స్థానికులు అడ్డ‌గించే ప్ర‌య‌త్నం చేశారు. పోలీసుల‌ ఆయుధాలను లాక్కున్నారు. వారిని బంధీ చేశారని, మొరాదాబాద్ సీనియర్ పోలీసు శలభ్ మాథుర్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన ఐదుగురు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఇద్దరు అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ కోసం వేట కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పెద్ద ఎత్తున నిర‌స‌లు వెల్లువెత్త‌డంతో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. 

ప‌ది మంది పోలీసులపై కేసు నమోదు.. ఇన్స్పెక్టర్ అదృశ్యం..

ఈ ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో కుంట పోలీస్ స్టేషన్‌లో 10 మంది పోలీసులపై హత్య కేసు నమోదైంది. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇప్పటికీ కనిపించకుండా పోయారు. అదృశ్యమైన ఇన్‌స్పెక్టర్ కోసం పోలీసులు గాలింపులు ప్రారంభించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అల్లర్లకు పాల్పడడం, నేరస్థులకు ఆశ్రయం కల్పించడం, అరెస్టును నిరోధించడం, హత్యాయత్నం, దోపిడీ, ప్రభుత్వోద్యోగిని గాయపరచడం, నేరపూరిత కుట్ర వంటి పలు సెక్షన్‌ల కింద మొరాదాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనితో పాటు వాంటెడ్ క్రిమినల్ తో పాటు 35 మంది తెలియని వారిపై కూడా కేసు నమోదు చేయబడ్డాయి.  

ఇటీవ‌ల థాకుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  మైనింగ్ మాఫియాపై కేసు నమోదైందని డీఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. మైనింగ్ శాఖకు చెందిన బృందంపై మైనింగ్ మాఫియా దాడి చేసి వారి వాహనాలను ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనితో పాటు SDM బృందంపై కూడా దాడి జరిగింది. ఈ మొత్తం కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశారు. అదే సమయంలో గ్రామస్తులు మరియు పోలీసుల మధ్య జరిగిన హింసలో మహిళ మరణించిన తరువాత, ప్రజలు నిరసనలు ప్రారంభించారని ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

click me!