
న్యూఢిల్లీ: కర్ణాటక హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు కు చెందిన ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును హేమంత్ గుప్తా సమర్ధించారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సుధాన్షు ధులియా తోసిపుచ్చారు.ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం ఉంది.
ఆడపిల్లల విద్య అనేది ఉన్నతమైందని జస్టిస్ దులియా అన్నారు. ఈ కేసును విచారిస్తున్న మరో న్యాయమూర్తితో తాను విబేధిస్తున్నట్టుగా ధులియా పేర్కొన్నారు. కర్ణాటక హైకోర్టు తీర్పుతో తాను ఏకీభవిస్తున్నట్టుగా మరో జడ్జి హేమంత్ గుప్తా చెప్పారు. పిటిషనర్లను 11 ప్రశ్నలను జడ్జి అడిగారు. ఈ అంశాన్ని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ విచారణ కోసం సీజేఐ ముందుంచుతామని జస్టిస్ ధులియా చెప్పారు.
also read;కర్ణాటక హిజాబ్ నిషేధంపై "సుప్రీం" సంచలన తీర్పు నేడే .. సర్వత్రా ఉత్కంఠ..
కర్ణాటక రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని ఇస్లాం చెప్పిందని కర్ణాటక హైకోర్టు గతంలో తీర్పును వెల్లడించింది.హిజాబ్ ధరించడం తమ ప్రాథమిక హక్కు అని పిటిషనర్లు చెబుతున్నారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
2021 అక్టోబర్ లో ఉడిపిలోని కాలేజీలో హిజాబ్ వివాదం ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈ వివాదం పాకింది. యూనిఫాం తప్పనిసరిగా ధరించి రావాలని విద్యాసంస్థ చేసిన సూచనను పాటించలేదు. హిజాబ్ ధరించి కొందరు విద్యార్ధినులు వచ్చారు. దీంతో వివాదం ప్రారంభమైంది.యూనిఫాం లేకుండా వచ్చిన ఆరుగురువిద్యార్ధినులను క్లాస్ రూమ్ లోకి అనుమతించలేదు. విద్యా సంస్థ బయట విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. మరోవైపు హిజాబ్ అనుకూలంగా,వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు సాగాయి. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించినా కూడా అనుమతివ్వాలని కోరుతూ హైకోర్టులో విద్యార్ధినులు పిటిషన్లు దాఖలు చేశారు.
2022 జనవరి 19న ఉడిపికి చెందినకాలేజీ యాజమాన్యం, విద్యార్ధులు, పేరేంట్స్, అధికారులతో సమావేశం నిర్వహించింది. కానీ ఈ సమావేశంలో ఎలాంటి ఫలితం రాలేద. జనవరి 26న మరోసారి సమావేశం నిర్వహించారు. హిజాబ్ లేకుండా కాలేజీకి రాలేని విద్యార్ధినులు ఆన్ లైన్ లో చదువుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధి చెప్పడంతో వివాదం మరింత ముదిరింది.
ఫిబ్రవరి మాసంలో హిజాబ్ ను వ్యతిరేకించే విద్యార్ధులు, అనుకూలంగా విద్యార్ధులు ఆందోళనలకు దిగారు. యూనిఫాం ధరించడాన్ని సవాల్ చేయడంతో పాటు హిజాబ్ ధరించి విద్యా సంస్థల్లోకి అనుమతి కోరుతూ ఉడిపి విద్యార్ధినులు దాఖలుచేసిన పిటిషన్లను కర్ణాటకహైకోర్టు ఈ ఏడాది మార్చి 15న కొట్టివేసింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈఏడాది సెప్టెంబర్ 22న పిటిషన్లపై న్యాయమూర్తులు హేమంత్ గుప్తా,ధులియా ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. 10 రోజుల పాటు ఇరువర్గాల వాదలను ఈ ధర్మాసనం వింది.