ఎన్నికల ఖర్చు తగ్గించుకోవడానికి ఈయన ఏం చేశాడో తెలుసా?

Published : Mar 29, 2021, 09:54 AM IST
ఎన్నికల ఖర్చు తగ్గించుకోవడానికి ఈయన ఏం చేశాడో తెలుసా?

సారాంశం

 బీజేపీ నేత ఒకరు ఎన్నికల్లో తమ ఖర్చు తగ్గించుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు.  


ఎన్నికలు అనగానే.. రాజకీయనాయకులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఎక్కడ లేని ఖర్చంతా చేసి తమను ప్రజలు గుర్తించేలా చేస్తారు. రూ.లక్షలు, రూ. కోట్లు ఖర్చు చేయడానికైనా వెనకాడరు. అలాంటిది.. ఓ అభ్యర్థి మాత్రం ఎన్నికల్లో ఖర్చు తగ్గించుకునేందుకు వినూత్న ప్రయత్నం చేశాడు.

త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికల్లో  గెలించేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా... బీజేపీ నేత ఒకరు ఎన్నికల్లో తమ ఖర్చు తగ్గించుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు.

బీజేపీ అభ్యర్థి హెచ్‌. రాజా చేస్తున్న ఎన్నికల ప్రచారం చాలా వినూత్నంగా ఉందని అందరూ చర్చించుకుంటున్నారు. నలుగురు యువకులతో కూడిన బృందాలను ఏర్పాటుచేసి, వారి వీపుకు బీజేపీ కటౌట్లు కట్టారు. వీరు కేవలం నడిచివెళ్తే చాలు. రాత్రి వేళల్లో కూడా లైట్లు ఉండడంతో ప్రచారం సాగుతోంది. వాహనాలు, లౌడ్‌ స్పీకర్లు, భారీ జెండాలు, తోరణాలు, బాణాసంచా, కార్యకర్తలు భారీగా గుమిగూడేలా డబ్బు ఖర్చు పెట్టకుండా, చిన్న మొత్తంలో మంచి స్పందన వస్తున్న ఇలాంటి ప్రచారానికి మరిన్ని బృందాలు ఏర్పాటుచేసి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం