మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా: లాక్‌డౌన్ కాదు.. కానీ అలాగే ఉండాలి, అధికారులకు ఉద్దవ్ ఆదేశం

By Siva KodatiFirst Published Mar 28, 2021, 7:48 PM IST
Highlights

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో కట్టడికి మహారాష్ట్ర సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలు చేయడానికి సిద్ధంగా వుండాలని అధికారులను ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఆదేశించారు. 

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో కట్టడికి మహారాష్ట్ర సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలు చేయడానికి సిద్ధంగా వుండాలని అధికారులను ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఆదేశించారు.

కరోనా కేసుల పెరుగుదలపై ఆదివారం అధికారులతో రివ్యూ చేసిన సీఎం.. ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నాగపూర్, బీడ్, పర్బనీ జిల్లాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది.

మరికొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగం మహారాష్ట్రలోనే వున్నాయి. ప్రతి రోజూ సగటున 35 వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి.

ముంబై, పూణే, థానే, నాగపూర్ సహా పలు ప్రాంతాలు కరోనా హాట్ స్పాట్‌లుగా మారాయి. బాధితుల్లో చాలా మంది కొత్త మ్యూటేషన్‌ల బారినపడిన వారే వుంటున్నారు. దాంతో మహారాష్ట్ర సర్కార్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. లాక్‌డౌన్ తరహాలో ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధంగా వుండాలని అధికారులను ఆదేశించింది. 

ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు సమూహాలుగా గుమిగూడవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, రెస్టారెంట్లు, మాల్స్, గార్డెన్స్, బీచ్ సందర్శనలపై ఆంక్షలు విధించింది.

రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ నైట్ కర్ఫ్యూను విధించింది. ప్రజలు ఎంత చెప్పినా వినేలా లేరని భావిస్తున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే మరోసారి లాక్‌డౌన్‌ అమలుకు సిద్ధమవుతున్నారు.

click me!