బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

Published : Oct 27, 2020, 10:49 AM ISTUpdated : Oct 27, 2020, 10:59 AM IST
బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సారాంశం

బీజేపీ నేత, సినీ నటి కుష్బూ సుందర్ మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

చెన్నై: బీజేపీ నేత, సినీ నటి కుష్బూ సుందర్ మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

మనుస్మృతిని ఉటంకిస్తూ మహిళలపై విసికె అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.

ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లున్న సమయంలో ఆమెను ముత్తుకాడు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. చిదంబరం వద్ద నిన్న జరిగిన ఆందోళనకు కూడ పోలీసులు అనుమతిని నిరాకరించారు.

 

కుష్బూను అరెస్ట్ చేసిన కొద్దిసేపటి తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేటీఆ రాఘవన్ ను మెల్మరువతుర్ సమీపంలోని అథర్ టోల్ గేట్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

ముందు జాగ్రత్త చర్యగా ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

కరోనా నేపథ్యంలో చిదంబరం వద్ద భారీగా ఆందోళనకారులు మోహరించకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేసినట్టుగా  సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.

అరెస్టైన తర్వాత ఈ విషయమై కుష్బూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పోలీస్ వ్యాన్ లో తీసుకెళ్లారని చెప్పారు. మహిళల గౌరవం కోసం తమ చివరి శ్వాస వరకు పోరాటం చేస్తామన్నారు. మహిళల భద్రత గురించి  ప్రధాని మోడీ ఎప్పుడూ మాట్లాడుతుంటారని ఆమె గుర్తు చేశారు. అతని మార్గంలోనే తాము నడుస్తామన్నారు. 

రెండో ట్వీట్ లో వీసీకే ని లక్ష్యంగా చేసుకొని ఆమె విమర్శలు గుప్పించింది. తమను అరెస్ట్ చేసినందుకు సంతోషించొద్దన్నారు. అరెస్ట్ చేసినంత మాత్రాన తాము నమస్కరించబోమని తేల్చి చెప్పారు.

దేశంలోని ప్రతి ఆడబిడ్డ గౌరవం కోసం మోడీ అవసరమైన చర్యలు తీసుకొంటున్నారని ఆమె చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Heavy Rush at Sabarimala Temple అయ్యప్ప స్వాములతో కిటకిట లాడిన శబరిమల | Asianet News Telugu
దేశంలోని 55 శాతం సెల్ ఫోన్లు తయారయ్యేది ఎక్కడో తెలుసా?