సమాజ్ వాది పార్టీ నేత కూతురితో పారిపోయిన బీజేపీ నేత ఆశీశ్ శుక్లా..

Published : Jan 19, 2023, 10:20 AM IST
సమాజ్ వాది పార్టీ నేత కూతురితో పారిపోయిన బీజేపీ నేత ఆశీశ్ శుక్లా..

సారాంశం

ఓ 47యేళ్ల పెళ్లై, పిల్లలున్న వ్యక్తి ఓ 26యేళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో.. ఆమెతో కలిసి లేచిపోయాడు. అయితే అతను బీజీపీ నేత కావడం, ఆమె ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ నేత కూతురు కావడమే కొసమెరుపు. 

ఉత్తరప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లో ఓ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ అధికార పార్టీ నేత ప్రతిపక్ష పార్టీ నేత కూతురితో ప్రేమలో పడ్డాడు. అంతేకాదు సినిమాటిక్ గా ఆమెతో పారిపోయాడు. అధికార, ప్రతిపక్షపార్టీల మద్య జరిగిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే…బిజెపి నేత ఆశిశ్ శుక్లా (47)కు అంతకుముందే వివాహమైంది.  అతనికి 21 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఓ సమాజ్ వాదీ పార్టీ నాయకుడి కూతురు(26)తో ప్రేమలో పడ్డాడు. ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపించాడు.  

అతనికి ముందే పెళ్లి కావడం, ఇరుపార్టీలు బద్దవిరోదులు కావడంతో ఈ లవ్ ఎఫైర్ ఉత్తర ప్రదేశ్ లో వివాదాస్పదంగా మారింది. సదర ప్రతిపక్ష సమాజ్ వాది నేత కూతురికి ఇటీవలే మరో వ్యక్తితో పెళ్లి కూడా ఖాయం అయ్యింది. కానీ ఆమెను తీసుకుని బిజెపి పార్టీ నేత పారిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు  తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతతో పారిపోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దీంతో ఈ వ్యవహారంపై రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరుగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు వాగ్వాదాలకు దిగడంతో ఇప్పుడు ఈ లవ్ ట్రాక్ యూపీలో  సంచలనంగా మారింది.

ఇక ఓట్ ఫ్రమ్ హోమ్.. త్రిపురలో మొదటి సారిగా ప్రవేశపెట్టనున్న ఎన్నికల కమిషన్.. సీనియర్ సిటిజన్లకు అవకాశం..

సదరు బిజెపి నేత ఆశిశ్ శుక్లా ప్రస్తుతం హార్ధోయి నగరానికి బిజెపి జనరల్ సెక్రెటరీగా ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పారిపోయిన జంట కోసం వెతుకుతున్నారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేల వ్యవహరించిన ఆశిశ్ శుక్లాను.. ఈ ఘటన తర్వాత పార్టీ నుంచి బహిష్కరించినట్లు  హార్ధోయ్ జిల్లా మీడియా ఇన్చార్జి గంగేష్ పాఠక్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Indian Army :ఎముకలు కొరికే చలిలో ఇండియన్ఆర్మీ కవాతు | PirPanjal Heavy Snowfall | Asianet News Telugu
First Day of 2026 at Sabarimala: నూతన సంవత్సరం శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ | Asianet News Telugu