ప్రేమను ఒప్పుకోలేదని దారుణం.. 15 ఏళ్ల బాలికను కాల్చి చంపిన యువకుడు..

Published : Jan 19, 2023, 09:53 AM IST
ప్రేమను ఒప్పుకోలేదని దారుణం.. 15 ఏళ్ల బాలికను కాల్చి చంపిన యువకుడు..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో భదోహి‌లో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి చంపాడు. బాలిక తన ప్రేమను అంగీకరించలేదనే కారణంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ఉత్తరప్రదేశ్‌లో భదోహి‌లో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి చంపాడు. బాలిక తన ప్రేమను అంగీకరించలేదనే కారణంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలిని అనురాధ బింద్‌గా గుర్తించారు. వివరాలు.. అనురాధ బింద్ తన కజిన్ నిషాతో కలిసి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా నిందితుడు అరవింద్ విశ్వకర్మ (22) ఆమెపై కాల్పులు జరిపాడు. తలపై కాల్చడంతో.. అనురాధ అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బాలికను ప్రేమిస్తున్నాడని.. అయితే ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Government Scheme : 8వ తరగతి పాసైతే చాలు, ఫ్రీగా రూ.48000 పొందండి.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman