బిజెపి నేతతో పాటు ఆయన సోదరుడిని కాల్చి చంపారు

Published : Nov 01, 2018, 10:25 PM IST
బిజెపి నేతతో పాటు ఆయన సోదరుడిని కాల్చి చంపారు

సారాంశం

బిజెపి జమ్మూ కాశ్మీర్ కార్యదర్శి అనిల్ పరిహార్ ను, అతని సోదరుడిని ఉగ్రవాదులు కిస్త్వర్ లో కాల్చి చంపారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు రవీందర్ రైనా చెప్పారు 

జమ్ము: జమ్మూ కాశ్మీరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని సాయుధులు బిజెపి రాష్ట్ర కార్యదర్శి అనిల్ పరిహార్ ను, ఆయన సోదరుడిని కాల్చి చంపారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. 

ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారా లేదంటే నేరస్థులు ఈ చర్యకు దిగారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  బిజెపి జమ్మూ కాశ్మీర్ కార్యదర్శి అనిల్ పరిహార్ ను, అతని సోదరుడిని ఉగ్రవాదులు కిస్త్వర్ లో కాల్చి చంపారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు రవీందర్ రైనా చెప్పారు 

గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మరణించారు. 

 

PREV
click me!

Recommended Stories

ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్