హర్యానా: కాంగ్రెస్‌కు భంగపాటు.. విశ్వాస పరీక్షలో నెగ్గిన ఖట్టర్ సర్కార్

By Siva KodatiFirst Published Mar 10, 2021, 6:31 PM IST
Highlights

హర్యానాలో బీజేపీని ఇరుకునపెట్టాలని భావించిన కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం మనోహర్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 

హర్యానాలో బీజేపీని ఇరుకునపెట్టాలని భావించిన కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం మనోహర్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

బీజేపీ, ఇతర ఎమ్మెల్యేల బలంతో అవిశ్వాస తీర్మానంలో ఖట్టర్ ప్రభుత్వం గెలిచింది. ఖట్టర్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలో కాంగ్రెస్ విపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా బుధవారం ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన అనంతరం, మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానం నోటీసును చేపడుతున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

అయితే ఈ తీర్మానంలో ముఖ్యమంత్రిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ నెగ్గలేకపోయింది. తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.

90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 45 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే కానీ విశ్వాస తీర్మానం నిలబడదు.

అయితే 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తగినంత మంది ఎమ్మెల్యేలను కూడగట్టడంలో విఫలమైంది. మొత్తం 50 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ.. సునాయాసంగా పరీక్షలో గట్టెక్కింది.
 

click me!