మారుమూల నేపథ్యం... సీఎంని అవుతానని అనుకోలేదు: తిరథ్ సింగ్ రావత్

By Siva KodatiFirst Published Mar 10, 2021, 3:21 PM IST
Highlights

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తనను ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అధిష్టానానికి తిరథ్ సింగ్ రావత్ కృతజ్ఞతలు తెలిపారు. 

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తనను ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అధిష్టానానికి తిరథ్ సింగ్ రావత్ కృతజ్ఞతలు తెలిపారు.

ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన తనలాంటి ఓ సామాన్య కార్యకర్తకు ఇంతటి అత్యున్నత హోదా అప్పగిస్తారని కలలో కూడా ఊహించలేదని రావత్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో తిరథ్ సింగ్ రావత్‌ను అధిష్టానం ఎంపిక చేసింది.

ఇందుకు సంబంధించి బుధవారం ఉత్తరాఖండ్ బీజేపీ ఎల్పీ సమావేశంలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తిరథ్ స్పందించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని రావత్ స్పష్టం చేశారు. 56 ఏళ్ల తిరథ్ సింగ్ రావత్ ప్రస్తుతం గర్హ్వాల్ నుంచి ఎంపీగా ఉన్నారు. 2013-15 మధ్య ఉత్తరాఖండ్ బీజేపీ శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2012 నుంచి 2017 వరకు చౌబ్తాఖల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.

click me!