Rajya Sabha: రాజ్య‌స‌భ‌లో సెంచ‌రీ కొట్టిన బీజేపీ.. 1990 త‌ర్వాత మొట్ట‌మొద‌టి పార్టీ ఇదే.. !

Published : Apr 01, 2022, 06:56 PM IST
Rajya Sabha: రాజ్య‌స‌భ‌లో సెంచ‌రీ కొట్టిన బీజేపీ.. 1990 త‌ర్వాత మొట్ట‌మొద‌టి పార్టీ ఇదే.. !

సారాంశం

BJP: రాజ్య‌స‌భ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌స్తుతం 101 మంది ఎంపీలు ఉన్నారు. గ‌త 3 దశాబ్దాలలో రాజ్యసభలో సెంచరీ సాధించిన మొదటి పార్టీగా బీజేపీ అవతరించింది.   

Rajya Sabha: గురువారం జరిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, అసోంలో విజయం సాధించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో తొలిసారిగా 100 సీట్ల‌ మార్కును చేరుకుంది. అసోం, త్రిపుర, నాగాలాండ్‌లో ఒక్కో సీటును గెలుచుకోవడంతో బీజేపీ చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో 100 మంది సభ్యులను కలిగి ఉన్న ఘనత సాధించింది.  ఆయా రాష్ట్రాల‌కు సంబంధించిన గురువారం నాడు ఓటింగ్ మ‌రియు లెక్కింపు జ‌రిగింది. 1988 తర్వాత ఎగువసభలో 100 మార్కును తాకిన తొలి పార్టీగా బీజేపీ అవతరించిందని కాషాయ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల నుండి మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలను భార‌తీయ జ‌న‌తా పార్టీ కైవ‌సం చేసుకుంది. 

పంజాబ్‌లో భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే ఐదు రాజ్యసభ స్థానాలను ఏకపక్షంగా కైవసం చేసుకుంది. పంజాబ్ నుండి కొత్త ఆప్ రాజ్యసభ ఎంపీలుగా రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, అశోక్ మిట్టల్, సంజీవ్ అరోరాలు ఉన్నారు. ఇక కేరళలోని మూడు స్థానాల్లో అధికార ఎల్‌డిఎఫ్‌ రెండు స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎల్‌డిఎఫ్ తరపున డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్‌ఐ) ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎఎ రహీమ్, సీపీఐ (ఎం) కన్నూర్ జిల్లా కార్యదర్శి పి సంతోష్ కుమార్, ప్రతిపక్షాల తరపున కేరళ మహిళా కాంగ్రెస్ చీఫ్ జెబి మాథర్ లు రాజ్య‌స‌భ‌కు ఎన్నికయ్యారు.

త్రిపుర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ మాణిక్ సాహా 40 ఓట్లతో రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ స్థానానికి ఎన్నికయ్యారు.  అతని ప్రత్యర్థి అభ్యర్థి, సీపీఐ(ఎం) అభ్యర్థి భాను లాల్ సాహాకు కేవలం 15 ఓట్లు మాత్రమే వచ్చాయి. అధికార బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణంలోని ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT)కి చెందిన ఎమ్మెల్యే ఓటింగ్ లో పాల్గొన‌లేదు. హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీలో తగినంత సంఖ్య లేకపోవడంతో కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో, హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్, బీజేపీ అభ్యర్థి సికిందర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నాగాలాండ్‌లో BJP నాయకురాలు S Phangnon కొన్యాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంటు ఎగువ సభలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళా శాసనసభ్యురాలిగా ఆమె గుర్తింపు పొందింది. ఇక అసోంలో అనేక మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేయడం లేదా వారి ఓట్లు చెల్లకుండా/రద్దు చేయడంతో రెండు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ను బీజేపీ అధిగమించింది. బీజేపీ నాయకురాలు పబిత్రా మార్గరీటా మరియు దాని మిత్రపక్షమైన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యుపిపిఎల్) మద్దతుతో రంగ్వ్రా నార్జారీ మెరుగైన మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి రిపున్ బోరా ఎగువ సభకు రాలేకపోయారు. ఎన్నికలు జరిగిన మొత్తం 13 స్థానాల్లో ఆప్, బీజేపీలు చెరో ఐదు, ఎల్‌డీఎఫ్‌ 2, కాంగ్రెస్‌ ఒకటి స్థానాల‌ను గెలుచుకున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Delhi Malviya Nagar Fire Incident: ఢిల్లీలోని మాల్వీయా నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం... | Asianet Telugu
కర్ణాటక సీఎం గా డికె శివకుమార్ ప్రమాణ స్వీకారం | D.K. Shivakumar Takes Oath | Asianet News Telugu