Karnataka Cabinet Expansion: 24 మందితో కర్నాటక మంత్రివర్గ విస్తరణ, ఏ వ‌ర్గాల నుంచి ఎంత‌మంది ఉన్నారంటే..?

Published : May 27, 2023, 02:44 PM IST
Karnataka Cabinet Expansion:  24 మందితో కర్నాటక మంత్రివర్గ విస్తరణ,  ఏ వ‌ర్గాల నుంచి ఎంత‌మంది ఉన్నారంటే..?

సారాంశం

Karnataka Cabinet Expansion: కర్ణాటక ప్ర‌భుత్వ‌ మంత్రివర్గ విస్తరణ జ‌రిగింది. ముఖ్య‌మంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వంలో 24 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఐదుగురు లింగాయత్, న‌లుగురు వొక్కలిగల వ‌ర్గాల‌కు చెందిన వారు ఉన్నారు.   

Karnataka Cabinet expansion Updates: కర్ణాటక ప్ర‌భుత్వ‌ మంత్రివర్గ విస్తరణ జ‌రిగింది. ముఖ్య‌మంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వంలో 24 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఐదుగురు లింగాయత్, న‌లుగురు వొక్కలిగల వ‌ర్గాల‌కు చెందిన వారు ఉన్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. శనివారం 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించారు. సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు హెచ్ కే పాటిల్, కృష్ణ బైరెగౌడ, ఎన్ చెలువరాయస్వామి, కే వెంకటేశ్, హెచ్ సీ మహదేవప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే, దినేష్ గుండూరావులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

వీరితో పాటు శరణప్రకాశ్ రుద్రప్ప పాటిల్, మంకల్ వైద్య, లక్ష్మీ హెబ్బాళ్కర్, బి.నాగేంద్ర, శరణబసప్ప దర్శనాపూర్, శివానంద్ పాటిల్, రామప్ప బాలప్ప తిమ్మాపూర్, ఎస్.ఎస్.మల్లికార్జున్, క్యాతసంద్ర ఎన్.రాజన్న, డి.సుధాకర్, సంతోష్ లాడ్, శివరాజ్ సంగప్ప తంగడగి, రహీంఖాన్, ఎన్ఎస్ బోసురాజు, సురే్ష బీఎస్, మధు బంగారప్ప, ఎంసీ సుధాకర్ ప్రమాణ స్వీకారం చేశారు.

 

 

కర్ణాటక కేబినెట్ విస్తరణ అప్డేట్స్ ఇలా ఉన్నాయి..

సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన సంతోష్ లాడ్, ఎన్ ఎస్ బోసరాజు, భైరతి సురేష్ లు కొత్తగా ఏర్పడిన కర్ణాటక ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు. మైసూరు నుంచి డాక్టర్ హెచ్ సీ మహదేవప్ప, బాగల్ కోట్ నుంచి ఆర్బీ తిమ్మాపూర్, కొప్పల్ నుంచి శివరాజ్ తంగడగిలను మంత్రులుగా తీసుకున్నారు. వీరంతా షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు. సిద్ధరామయ్యకు బలమైన మద్దతుదారుగా భావించే కేఎన్ రాజన్న, బి.నాగేంద్రలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరూ షెడ్యూల్డ్ తెగకు చెందినవారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దినేష్ గుండూరావు సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీదర్ లో ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రహీంఖాన్, చిత్రదుర్గ నుంచి డి.సుధాకర్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రి వర్గ విస్తరణ కోసం కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరులోని విధానసౌధకు క‌లిసి అంత‌కుముందు చేరుకున్నారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో వివిధ ఉపవర్గాలకు చెందిన ఎనిమిది మంది లింగాయత్ లు ఉన్నారు. అలాగే,  ఐదుగురు వొక్కలింగ‌లు ఉన్నారు. కాగా, మే 20న సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

CM Vijay First Independence Day | సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరేసిన విజయ్| FlagHoisting | TamilNadu
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్ స్పీచ్ కి త్రిష ఫిదా | CM Vijay Independence Day Speech