
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్న karhal అసెంబ్లీ స్థానం నుండి కేంద్ర మంత్రి SP SingH Baghel ను BJP బరిలోకి దింపనుంది.నామినేషన్ దాఖలు చేసేందుకు కేంద్ర మంత్రి సోమవారం నాడు కలెక్టరేట్ కు చేరుకొన్నారు. బఘేల్ ఆగ్రా పార్లమెంట్ స్థానం నుండి ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇవాళ ఉదయమే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ Akhilesh Yadav కర్హల్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధులుగా ఎవరూ పోటీ చేసినా కూడా ఓటమి పాలౌతారని అఖిలేష్ యాదవ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Mulayam Singh Yadav ప్రాతినిథ్యం వహిస్తున్న Mainpuri పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే కర్హల్ అసెంబ్లీ స్థానం ఉంది. ఈ నెల 20వ తేదీన ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే శతాబ్దపు దేశ చరిత్రను లిఖిస్తాయని అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ప్రగతిశీల ఆలోచనలతో కూడిన సానుకూల రాజకీయ ఉద్యమమే తన విషన్ అని అఖిలేష్ యాదవ్ చెప్పారు.
ఎస్సీ సింగ్ భగేల్ ప్రస్తుతం కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఎస్పీ సింగ్ సమాజ్‌వాదీ పార్టీతో రాజకీయాలను ప్రారంభించారు. 2009 ఎన్నికల సమయంలో ఆయన సమాజ్‌వాదీ పార్టీని వీడి బీఎస్పీలో చేరారు. 2014 వరకు ఆయన బీఎస్పీలోనే కొనసాగారు. 2014లో ఎస్పీ సింగ్ బీఎస్పీని వీడి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ తరపున జ్ఞానవతి యాదవ్, బీఎస్పీ తరపున కుల్దీప్ నారాయణ్ లు బరిలో నిలిచారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 3.71 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 1.44 లక్షల ఓటర్లు యాదవులే. మొత్తం ఓటర్లలో 38 శాతం యాదవ ఓటర్లున్నారు.
కర్హల్ అసెంబ్లీ స్థానం నుండి ఇప్పటి వరకు విజయం సాధించింది వీరే
1956లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. 1957లో ప్రజా సోషలిస్ట్ పార్టీ తరపున రెజ్లర్ నాథూసింగ్ యాదవ్ విజయం సాధించారు. ఆ తర్వాత స్వతంత్ర పార్టీ అభ్యర్ధిగా ఆయన మూడ దఫాలు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1980లో కాంగ్రెస్ టికెట్ పై శివమంగల్ సింగ్ విజయం సాధించారు. 1985 లో బాబురామ్ లోక్‌దళ్ టికెట్ పై విజయం సాధించారు. ఆ తర్వాత రెండు సార్లు జనతా పార్టీ టికెట్ పై గెలుపొందారు. ఆ తర్వాత రెండు సార్లు సమాజ్‌వాదీ పార్టీ టికెట్ పై గెలిచారు. 2002లో సోబ్రాన్ సింగ్ ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో కూడా ఆయన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి విజయం సాధించారు.