ప్రతిపక్షాల లెటర్‌కు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ నిర్ణయం.. 9 రాష్ట్రాల్లో 9 ప్రెస్‌మీట్‌లు

Published : Mar 09, 2023, 04:30 PM IST
ప్రతిపక్షాల లెటర్‌కు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ నిర్ణయం.. 9 రాష్ట్రాల్లో 9 ప్రెస్‌మీట్‌లు

సారాంశం

ప్రతిపక్షాల లెటర్‌కు బీజేపీ కౌంటర్ ఇవ్వాలని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ లేఖ రాసిన ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాల్లో బీజేపీ ప్రెస్ మీట్‌లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నది. ఇందులో భాగంగా తొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ నేతలు ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ ఇవ్వనుంది.  

న్యూఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాల నుంచి ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా‌ను ఈడీ అరెస్టు చేసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఈ లేఖ రాశాయి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ లెటర్‌కు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. 9 రాష్ట్రాల్లో 9 ప్రెస్‌మీట్‌లు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలిసింది.

ప్రధానమంత్రికి లేఖ రాసిన ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఢిల్లీ, పంజాబ్, జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో త్వరలోనే బీజేపీ ఈ లేఖకు సమాధానం ఇవ్వనుంది.

ఆ లేఖ రాసిన నేతలంతా అవినీతిపరులని, దర్యాప్తు అంటే జంకుతున్నారనే కోణంలో ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ నేతలు విరుచుకుపడనున్నట్టు సమాచారం. ఢిల్లీలో ఎంపీ మనోజ్ తివారీ, పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి, బిహార్‌లో సంజయ్ జైస్వాల్, ఉత్తరప్రదేశ్‌లో బ్రిజేశ్ పాఠక్, తెలంగాణలో బండి సంజయ్‌లతో ఈ ప్రెస్ మీట్లు నిర్వహించనుంది.

ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు లేఖ రాశాయి. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల తీరుపై అనుమానాలు వ్యక్తం చేశాయి. వాటిని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు చేశాయి. ఆసక్తికరంగా ప్రతిపక్షాలు రాసిన ఈ లేఖ నుంచి కాంగ్రెస్ పక్కకు తప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ లేఖలో సంతకం పెట్టలేదు. 

ప్రతిపక్ష నేతలు సీఎం కే చంద్రశేఖర్ రావు, మమతా బెనర్జీ, భగవంత్ మాన్, అరవింద్ కేజ్రీవాల్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లు ఈ లేఖ పై సంతకాలు పెట్టారు.

Also Read: మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత ప్రధానికి 8 విపక్ష పార్టీల లేఖ.. కాంగ్రెస్ ఎందుకు దూరంగా ఉన్నది?

ప్రధాని మోడీని ఉద్దేశించి ప్రతిపక్షాలు రాసిన లేఖలో ప్రధానంగా ఈ అంశాలు పేర్కొన్నాయి. ‘మన దేశం ఇంకా ప్రజాస్వామ్య దేశమే అని మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాం. ప్రతిపక్షాలపై విపరీత విచారణతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ మన ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లుతున్నట్టు కనిపిస్తున్నది’ అని వివరించారు.

‘.. మనీశ్ సిసోడియాను దీర్ఘకాలం వెంటాడి వేధించిన తర్వాత అవకతవకాల ఆరోపణలపై ఆధారాలు లేకున్నా సీబీఐ అతడిని అరెస్టు చేసింది.’ అని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ‘2014 నుంచి మీ పాలన వచ్చిన తర్వాత ప్రముఖ రాజకీయ నేతలను దర్యాప్తు సంస్థలు అరెస్టులు చేస్తున్నాయి, రైడ్లు చేస్తున్నాయి. ఇందులో ఎక్కువ మంది ప్రతిపక్ష నేతలే ఉన్నారు. అదేంటో మరి బీజేపీని చేరిన ప్రతిపక్ష నేతలపై ఈ దర్యాప్తు సంస్థల విచారణ వేగం మందగిస్తున్నది’ అని తెలిపారు.

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను ఉదాహరణగా తీసుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు హిమంత బిశ్వ శర్మపై 2014 నుంచి 2015 కాలంలో సీబీఐ, ఈడీలు ఫోకస్ పెట్టాయి. అతను బీజేపీలో చేరిన తర్వాత అనూహ్యంగా ఈ కేసులు పురోగతి సాధించనేలేవని పేర్కొన్నాయి. అదే విధంగా నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో టీఎంసీ నేత సువేందు అధికారి, ముకుల్ రాయ్‌‌లపై ఈడీ, సీబీఐలు ఆరా తీశాయి. కానీ, వారు బీజేపీలో చేరిన తర్వాత కేసుల దర్యాప్తు ముందుకు సాగలేదని తెలిపాయి.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu