ముస్లిం ఓట్లు లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు - బద్రుద్దీన్ అజ్మల్

By Sairam Indur  |  First Published Jan 10, 2024, 1:51 PM IST

ముస్లిం ఓట్లు (muslim votes) లేకుండా బీజేపీ (bjp)కేంద్రంలో అధికారం చేపట్టలేదని ఏఐయూడీఎఫ్ (AIUDF) చీఫ్, ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ (Badruddin Ajmal) అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీకి ముస్లిం ఓట్లు తప్పకుండా కావాలని తెలిపారు.


తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలో నిలిచే ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అధ్యక్షుడు, ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు లేకుండా ఆ పార్టీ గెలవలేదని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు.

అతి వృద్ధ పెద్ద పులి ‘ఎస్టీ -2’ ఇక లేదు..

Latest Videos

అస్సాంలోని గోల్పారాలో పార్టీ నాయకులతో కలిసి అజ్మల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘‘ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ముస్లిం ప్రాంతాలకు వెళ్లి మసీదులు, మదర్సాలను సందర్శించి తీసుకురావాలని చెప్పారు. కనీసం 10 శాతం ఓట్లు వస్తే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలము. లేకుంటే మనం చేయలేము.’’ అని అన్నారు. 

రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయవద్దని తమ పార్టీ సభ్యులు, మద్దతుదారులకు సూచించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే తమ పార్టీ సభ్యులకు, మద్దతుదారులకు దిశానిర్దేశం చేశామని, ఒక్క ఓటు కూడా బీజేపీకి పడొద్దని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడటానికి తమ పార్టీ కాంగ్రెస్ కు 11 స్థానాలను ఇచ్చిందని అజ్మల్ గతేడాది నవంబర్ లో చెప్పారు. ఈ ఎన్నికల్లో అస్సాంలో తమ పార్టీ మూడు స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని అమ్రోహాలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి: మరో ఇద్దరి పరిస్థితి విషమం

అసోంలోని 14 లోక్ సభ స్థానాలకు గాను 3 స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. ధుబ్రీ, నాగావ్, కరీంగంజ్ స్థానాల్లో పోటీ చేస్తామని, మిగతా 11 సీట్లను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్ కు ఇచ్చామని చెప్పారు. ఇండియా కూటమికి ఏఐయూడీఎఫ్ మద్దతు ఇస్తుందని తెలిపారు. 

ఇదిలావుండగా.. రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం సీట్ల పంపకాల ఒప్పందానికి రావడానికి ఇండియా భాగస్వామ్య పక్షాల మధ్య చర్చల కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం గౌహతికి చేరుకున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అస్సాం యూనిట్ రాష్ట్ర కార్యవర్గ, కోర్ కమిటీ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించే అవకాశం కనిపిస్తోంది. కాగా.. బీజేపీకి అస్సాం నుంచి 9 మంది ఎంపీలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం 14 లోక్ సభ స్థానాలు ఉండగా, కాంగ్రెస్ కు ముగ్గురు, ఏఐయూడీఎఫ్ కు ఒకరు, ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. 

click me!